బైబిల్ దేవుడు యెహోవా మాట నిలబడడు అని బైబిల్ చదివితే ఈజీ గా అర్థం అయిపోతుంది.
బైబిల్లో జంతు బలి ఆచారం ఉంది అని ఇంతక ముందే చాలా సార్లు చెప్పుకున్నాం కదా, ఐతే జంతుబాలుల వలన ఉపయోగం ఏమిటి? అనేదానిపైన జంతుబలి నియమాన్ని మొదలెట్టిన బైబిల్ దేవుడుకే క్లారిటీ లేదు.
మొదట్లో పాపం పోవాలంటే జంతువుల్ని ఇవ్వాలి అని అడిగాడు యెహోవా. జనం భయంతో బలులు ఇచ్చారు. ఆలా కొన్ని లక్షల బలులు తీనుకున్న తర్వాత యెహోవా మాట మార్చేశాడు.
పాపపరిహారం కోసం యెహోవా అడిగిన బలి కి రెఫీన్స్ లు చూడండి.
RAKTA BALI
రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.( లేవీయకాండము 17:11)
DATE AINA THARVATHA
వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువులకళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.(హెబ్రీయులకు 13:11)
DELIVERY AINA TARVATA కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.(లేవీయకాండము 12:6)
ఇలా ప్రతి చిన్న కారణానికి పాపం అని భయపెట్టి జంతుబలి వసూలు చేసేవాడు యెహోవా. పాపం పోతుంది కదా అన్ని అందరూ బలులు ఇచ్చారు . అంత ఎందుకు మేరీ కుడా యేసుని కనిన పాపానికి రెండు పావురాళ్ళు బాలి ఇచ్చింది (లూకా 2:22)
అయితే యెహోవా ఇప్పుడు బాంబు పేల్చాడు .
బలుల వలన పాపం పోదు అని చెప్తున్నాడు.
ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. (హెబ్రీయులకు 10:4)
మరి పాపం పోకపోతే ఇన్నాళ్లు ఎందుకు బలులు అడిగినట్టు ?
సమాధానం బైబిల్ లోనే ఉంది.
మోసే తమ్ముడు అహరోను ఫ్యామిలీ కడుపు నింపడం కోసం
అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. (నిర్గమకాండము 29:32)
కాలుతున్న జంతువులు వాసన యెహోవా పీల్చడం కోసం
బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. (నిర్గమకాండము 29:18)
పాపం ఈ విషయం తెలియక యెహోవా ఏదో తమ పాపాలకి ప్రయశ్చితం చేయడానికే బలి ఆచారం పెట్టాడు అనుకొని జంతువులని బలి ఇచ్చిన వారంతా నిజంగానే గొర్రెలు అనిపిబచుకున్నారు.
అవునట్టు మర్చిపోయాను. కాలుతున్న జంతువుల వాసన యెహోవా పీల్చినట్టు ఎక్కడ ఉంది?
ఆదికాండము 8:20
అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువు లన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
ఆదికాండము 8:21
అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి….ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.
Genesis 8:21
The LORD smelled the pleasing aroma and said in his heart: “Never again will I curse the ground because of man, even though every inclination of his heart is evil from childhood. And never again will I destroy all living creatures, as I have done.
చూశారు కదా! తన స్వార్ధం కోసమే తప్ప ప్రజల పాపాల కోసం యెహోవా జంతుబలి అడగలేదు. అలాగే మోసే కల్పించిన మతంలో తన తమ్ముడి ఫ్యామిలీకి జంతుబలులు / మాంసం దక్కేలా మోసే ప్లాన్ చేసి జనాలని గొర్రెలని చేశారు.