ఒక్కో సారి బైబిల్ కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి చదివి ఊరుకోవడమే తప్ప డిస్కస్ చేయడానికి ఎవరూ సాహసించని విధంగా ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి.
సౌలు కూతురిని పెళ్లాడతా అని ముందుకు వచ్చిన దావీదు ని ఒక విచిత్రమైన ఎదురు కట్నం అడుగుతాడు సౌలు అనే రాజు.
100 మంది పురుషాంగ ముందు తోళ్ళు తెమ్మని దావీదుకి తెలియజేస్తాడు.
దావీదు కూడా ఛాలెంజ్ మామా అంటూ బయల్దేరు వెళ్లి 200 మందిని చంపి FORESKINS తెస్తాడు. ఇందులో బైబిల్ దేవుడు కూడా సహాయం చేశాడు అనడం కొసమెరుపు.
1 Samuel 18:23-29
23 సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీదుతో సంభాషింపగా దావీదునేను దరిద్రుడనైయెన్నిక లేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా
24 సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి.
25 అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యము గలవాడైరాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడ నెను.
26 సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై
27 గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.
28 యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి
29 దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్ల ప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను.
మనలో మన మాట …
1. ఇంతకీ 100 ముందోళ్లు (foreskins) ఎదురు కట్నం అడిగిన సౌలు, ఇప్పుడు 200 దొరికాయి కదా వాటిని ఏం చేసుకుంటాడు?
2. ఇక్కడ దావీదుకు యెహోవా ఏ విధంగా సహాయం చేసాడు ? చంపడంలోనా ? లెక్క పెట్టడం లోనా?
3. దేవుడిని ఇలా కూడా వాడుకోవచ్చా ? ఇలాంటి పనుల్లో దేవుడు సహాయం చేస్తాడా ?