అవును యెహోవా కోసం, యెహోవాని ప్రసన్నం చేసుకోవడం యూదులు 3000 జంతువుల్ని ఒక సందర్భంలో తగలబెట్టేశారు.
అందులో 1000 ఎద్దులు, 1000 గొఱ్ఱె పొట్టేళ్లు, 1000 గొర్రె పిల్లలు ఉన్నాయి. వీటన్నిటినీ మంటల్లో తగలబెట్టేశారు. ఆ మంటల్లో డబ్బాల కొద్దీ wine (ద్రాక్షారసం) పారబోశారు.
తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా 1000 యెద్దులను 1000 గొఱ్ఱ పొట్టేళ్లను 1000 గొఱ్ఱపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి. (1 దినవృత్తాంతములు 29:21)
సాధారణంగా హిందూ ఇళ్లల్లో జరిగే పూజల్లో ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం దేవుడుకి నైవేద్యం పెట్టి మనమే తినేస్తాం.
కానీ క్రైస్తవులు అలా కాదు. జంతువుల్ని యెహోవా సన్నిధిలో తగలబెట్టి వాటి పొగ ని వాళ్ళ దేవుడు యెహోవా ఆఘ్రాణిస్తాడు అని నమ్ముతారు. జంతువులని మందు (వైన్ ) పోస్తూ తగలబెడతారు. ఆ కాలుతున్న జంతువుల వాసన వాళ్ళ దేవుడికి ఇంపైన సువాసన గల హోమం అని నమ్ముతారు.
జంతువుని బలిచ్చే ముందు జంతువుల బోరని, కుడి జబ్బని, ఇంకా కొన్ని భాగాలను ప్రధాన అర్చకుడు పట్టుకుపోగా , జంతువుల కొవ్వుని వేరు చేసి మిగతా భాగాలని వేరు చేసి, వాటి డొక్కాలని చీల్చి, రక్తాన్ని పారబోసి … ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ చేసి యెహోవా కి మంచి సువాసన గల ఇంపైన వాసన వచ్చే పొగని కానుకగా ఇస్తారు.
యెహోవా పేరుతో జరిగే ఈ తంతు అనేక ఏళ్ళు గడిచింది. ఒక్క సందర్భంలో 3000 జంతువుల్ని చంపేశారు అంటే , కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగిన జంతువుల మారణహోమంలో ఎన్ని జంతువులు బలి అయ్యి ఉంటాయి?
ఎంత wine వృథాగా పోయి ఉంటుంది ? ఎంత ప్రజాధనం వృథా అయ్యి ఉంటుంది ?
దేవుడు ఇంత క్రూరుడా ? కంపుని యింపుగా భావించే వాడా ?
వర్షాలు పడతాయని యజ్ఞాలు చేస్తే తప్పు అని కొందరు అంటారు. వాటిలో సుగంధ ద్రవ్యాలు వేస్తారు. ప్రకృతిలో సమతుల్యం ఏర్పడి వానలు కురుస్తాయని కొందరు భావిస్తారు.
అయితే జంతువుల్ని చంపి, తగలబెట్టి, ఆ వాసన మా దేవుడికి ఇంపైన కంపు అని , అదే సువాసన గల హోమము అని చెప్పుకోవడం ఎంత వరకూ కరెక్ట్ ?
పూజలో పెట్టే నైవేద్యం దేవుడి పేరుతో మనుషులు తింటూ మానవసేవే మాధవ సేవ అన్న మాటను నిజం చేస్తుంటే తప్పు బట్టి,
ధనాన్ని, wine ని , జంతువులని కాల్చి బూడిద చేస్తూ అది మా దేవుడికి ఇంపైన సువాసన గల హోమం అనడం సబబేనా ?
యెహోవా ఇతర దేవతలకి యజ్ఞాలు చెయ్యొద్దు అని చెప్పాడు. కానీ తనకు మాత్రం ఇవన్నీ దక్కాలి అని అన్నాడు ?
ఇవి వృథా ఖర్చులు కాదా ?