
ముసలోడే కానీ మహా ముదురు!
100 ఏళ్ళ వయసులో అబ్రాహాముకి పిల్లలు పుట్టారు అంటే మనం ఆశ్చర్యపోతాము. కానీ Noah ఏకంగా 500+ ఏజ్ లో పిల్లల్ని కన్నాడు అంటోంది బైబిల్. దీన్ని సైన్స్ సమర్ధిస్తుందా?
నాకు అప్పుడే 100 ఏళ్లు నాకు పిల్లలు ఎక్కడ నుండి పుడతారు అని అబ్రాహాము -సారా జంట నవ్వుకున్నట్టు మనం బైబిల్ లో చదువుకున్నాం. కానీ ఇది చూడండి.
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. (ఆదికాండము 5:32)
After Noah was 500 years old, he became the father of Shem, Ham and Japheth.(Genesis 5:32)
ఇంగ్లీష్ అనువాదంలో 500 years తరవాత నోవహు కి ముగ్గురు పిల్లలు పుట్టారు అన్నట్టు క్లియర్ గా రాసుకున్నారు. కానీ తెలుగులో మాత్రం 500 ఏళ్లు బతికిన నోవహు 3 పిల్లలకి తండ్రి అయ్యాడు అన్నట్టు రాసుకున్నారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంత ఏజ్ లో ఉన్నప్పుడు పుట్టారో సరిగా రాయలేదు.లేదా తెలుగులో కొంచెం తెలివితేటలు వాడి కవరింగ్ చేశారు అనుకోవాలి.
ఎందుకు అంటే గతంలో కూడా ఇంగ్లీష్ అనువాదాలని తెలుగులో సరి చేసిన సందర్భాలు మనం చూసాము.
కానీ 500 ఏళ్ళకి పిల్లలు పుట్టడం ఇప్పటి సైన్స్ ప్రకారం అసాధ్యం. ఒకవేళ అలా పుట్టించాడు అంటే నోవహు ముసలోడు కాదు మహా ముదురు అనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు.
కానీ ఈ అద్భుతమైన సంఘటనని సైన్స్ ఒప్పుకుంటుందా? లేకపోతే కట్టు కథగా భావించి కొట్టిపడేస్తుందా?