
దేవుడు ఆత్మ స్వరూపి కదా, ఆత్మకు అవయవాలు ఉంటాయా?
ఏమో ఎవడికి తెలుసురా.. ఎవడికి తెలుసు అనుకుంటున్నారా?
అక్కడే ఆగండి. బైబిల్ లో యెహోవా ఎందరికో కనపడ్డాడు. ఎందరో యెహోవాని చూశాము అని చెప్పుకున్నారు. కొందరు అతనితో ముఖా ముఖి మాట్లాడారు. కొందరు అదంతా ఒట్టిదే.. దేవుడిని ఎవరు చూడలేదు. అన్నారు. ఇంతకీ యెహోవాని ఎవరైనా చూశారా? చూస్తే ఎలా ఉంటాడు? అసలు యెహోవా అనే వాడు మనిషి లాగా ఉంటాడా? ఇంకెలాగైనా ఉంటాడా?
అసలు కనపడాలంటే యెహోవా కి ఒక శరీరం వుండాలి కదా.. అది కూడా చూద్దాం రండి.
- బైబిల్ లో వర్ణించబడిన యెహోవా శరీరం. యెహోవా కళ్లు
యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.(సామెతలు 15:3)
యెహోవా కనురెప్పలు
The LORD is in His holy temple! The LORDS throne is in heaven! His eyes behold; His eyelids test the children of men ( Psalms 11:4)
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. (సామెతలు 11:4)
యెహోవా నాసికా రంద్రాలు:
వారుమా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.(యెషయా 65:5)

శత్రువులను చంపే దేవుని ముక్కు.
యెహోవా శరీర భాగాల్లో ముక్కు వర్ణన
- శత్రుసంహారం
- దహన బలి వాసన పీల్చడం
శత్రుసంహారం
నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను. (నిర్గమకాండము 15:8)
By the blast of your nostrils the waters piled up. The surging waters stood firm like a wall; the deep waters congealed in the heart of the sea. (Exodus 15:8)
నీవు నీ గాలిని(ముక్కు నుండి వచ్చు గాలి = ఊపిరి) విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.(నిర్గమకాండము 15:10)
But you blew with your breath, and the sea covered them. They sank like lead in the mighty waters.(Exodus 15:10)
ఈ విధంగా శత్రు సంహారం చేయడంలో యెహోవా ముక్కు ప్రధాన పాత్ర వహించేది.
దహన బలి #వాసన పీల్చడం
అలాగే యెహోవా ముక్కు దహన బలుల వాసనను పీల్చి భక్తులను అనుగ్రహించేది.
అప్పుడు యెహోవా ఇంపయిన #సువాసన #నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.(ఆదికాండము 8:21)
The LORD #smelled the pleasing #aroma and said in his heart: “Never again will I curse the ground because of man, even though every inclination of his heart is evil from childhood. And never again will I destroy all living creatures, as I have done. (Genesis 8:21)
యెహోవా నోరు:
అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.(మత్తయి 4:4)
వాసన పీల్చే యెహోవా ముక్కు గ్రంధులు.
అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.(ఆదికాండము 8:21).
యెహోవా పెదాలు / నోరు
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.(ఆదికాండము 2:7)
యెహోవా సైజు ఎంత?
మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.(నిర్గమకాండము 34:5).
అంటే ఒక మేఘమంత సైజు ఉంటాడా యెహోవా?
యెహోవా చేతులు:
నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను; (నిర్గమకాండము 33:22)
యెహోవా కుడి చెయ్యి
యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును.(నిర్గమకాండము 15:6)
యెహోవా వీపు + చేతులు
నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. (నిర్గమకాండము 33:23)
యెహోవాకి కుడి వైపు, ఎడమ వైపు అని రెండు ఉంటాయి. కుడివైపున యేసు ఉంటాడు.
కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు. (అపో. కార్యములు 2:33)
యెహోవా కాళ్ళు
చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా.. (ఆదికాండము 3:8)
సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. (ఆదికాండము 3:8 IRVTEL)
సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని, తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు. (ఆదికాండము 3:8 TERV)
Then the man and his wife heard the sound of the LORD God as he was walking in the garden in the cool of the day, and they hid from the LORD God among the trees of the garden.(Genesis 3:8).
బైబిల్ దేవుడు సీనాయి పర్వతం మీద మోషే పక్కన నిలబడ్డాడు.
మేఘములో యెహోవా #దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
(నిర్గమకాండము 34:5 TELUBSI)
ఇలా యెహోవాకి ఒక ఆకారాన్ని బైబిల్ వివరించింది. కాబట్టి యెహోవా మనిషి లాగానే ఉంటాడు చెప్పొచ్చు.
పైగా నరులని తన పోలిక చొప్పున పుట్టించాడు. పైగా మగాడు తన పోలిక అని చెప్పాడు యెహోవా.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.(ఆదికాండము 1:27)
కాబట్టి యెహోవా అనే ఒక మగ దేవుడు, మనిషి ఆకారం లోనే ఉంటాడు. ఒక మేఘం మీద కూర్చొని కిందకి దిగి రాగలిగిన అకృతి కూడా అతనికి వుంటుంది.
యెహోవా ని ఎవరైనా చూశారా?
- తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి
ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను.(నిర్గమకాండము 24:9-10)
- యాకోబు-నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.(ఆదికాండము 32:30)
- వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.(యోబు 42:5).
4.మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.(ఆదికాండము 18:1).
ఇంతకీ యెహోవా ని ఎవరైనా చూశారా? చూడలేదా? చూడకుండా మోసే అబద్ధాలు చెప్పి కొత్త మతాన్ని సృష్టించాడా?
యేసు తప్ప యెహోవాని ఎవరూ చూడలేదని మరో వాక్యం కనిపిస్తుంది!
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.(యోహాను 1:18)
చూసిన వాళ్లు చూశాము అని చెప్పారు. కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, వీపు అన్నీ వర్ణించారు.
చూడని వాళ్లు ఆత్మ స్వరూపి అన్నారు.
అలాగే దేవుడికి వస్త్రాలు కూడా ఉన్నాయి అంటుంది బైబిల్
ఇంతకీ ఏది నిజం? అసలు బైబిల్ లో నిజం ఉందా?