
బైబిల్ ని ఉన్నది ఉన్నట్టుగా అనువాదం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?
రిఫరెన్స్ -1
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.(2 సమూయేలు 12:8)
నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.(2 సమూయేలు 12:11)
పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.(2 సమూయేలు 12:12).
గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.(2 సమూయేలు 12:15).
పైన ఇచ్చిన వచనాలను జనం మాట్లాడుకునే భాషలో, ఉన్నది ఉన్నట్టు translate చేస్తే ఇలా ఉంటుంది:
ఒరేయ్ వెధవ దావీదు..! నీ మామ పెళ్ళాల్ని కూడా నీ దగ్గరే పడుకోబెట్టాను కదరా! సరిపోలేదా? చెప్పు కావాలంటే ఇంకా ఇస్తాను. పోయి పోయి హిత్తీయుడైన ఆ ఊరియా పెళ్ళాన్ని తగులుకున్నావేమిరా? నీ కొడుకుని చంపేస్తా! నీ పెళ్ళాన్ని నడి రోడ్డు మీద రేప్ చేయిస్తా!
………………..
రెండో ఉదాహరణ:
మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము? (పరమగీతము 8:8)
ఇది చాలా poor translation.
We have a young sister, and her breasts are not yet grown. What shall we do for our sister for the day she is spoken for? (పరమగీతము 8:8)
జనం భాషలో అనువాదం:
మాకొక చెల్లి ఉంది. తనకి ఇంకా వక్షోజాలు పెరగలేదు. రేప్పోద్దున తనకి పెళ్లి చేయాల్సి వస్తే మేమేం చెయ్యాలి?
……………..
మూడో ఉదాహరణ:
అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.(పరమగీతము 2:3).
జనం మాట్లాడుకునే భాష లో..
అడవిలోని యాపిల్ చెట్టులాగా నా lover ఉన్నాడు. నేను నా lover కాళ్ళ దగ్గర ( నీడలో ) కూర్చున్నాను. అతని పండు నా నోటిలో ఉంది. అబ్బా ఎంత రుచిగా ఉందో తెలుసా!!!
……
నాలుగో ఉదాహరణ:
నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. (యెషయా 47:3).
జనం భాషలో…
నీ గుడ్డలూడదీసి నలుగురిలోనూ నీ పరువు తియ్యకపోతే నా పేరు యెహోవానే కాదు!
మరికొన్ని ఉదాహరణలు next పోస్టులో…