
innocent father had sex with daughters
బైబిల్లో నీతిమంతుడైన ఒక అమాయక తండ్రి కథ!
పాస్టర్ గారు చర్చిలో ఎన్నో కథలు చెప్తారు. అందులో హైలైట్ గా నిలిచేది మాత్రం లోతు గారి కథే.
తన ఇద్దరు కూతుర్లతో శృంగారం చేసి, ఇద్దరు మగ పిల్లల్ని కన్న తండ్రిగా రికార్డుల కెక్కిన లోతు, యెహోవా దృష్టిలో నీతి మంతుడు అంట!
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.(ఆదికాండం 19:36)
లోతు నీతిమంతుడు అని బైబిల్ చెప్తోంది.
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. (2 Peter 2:7)
……..
అయితే ఈ లోతు కథ చెప్పేటప్పుడు క్రైస్తవులు, పాస్టర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు.
క్రైస్తవులు చెప్పే సమాధానాలు
- తాగిన మైకంలో sex చేశాడు కాబట్టి తప్పు కాదు.
- కూతుళ్లు తప్పు చేశారు కానీ లోతు మంచోడే.
- లోతు కూతుళ్ళకి శిక్ష పడింది.. (?)
- వాళ్లు గత్యంతరం లేక తప్పు చేశారు.
సరే నా ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం చెప్పండి.
- బైబిల్ ప్రకారం తండ్రికి కూతుళ్లు మందు తాగించవచ్చా? అసలు ఒళ్ళు మరచిపోయి సొంత కూతుళ్ళని గుర్తుపట్ట లేనంతగా లొంగదీసుకునే మందుని ( ద్రాక్షరసం ) తాగడం బైబిల్ ప్రకారం తప్పా? ఒప్పా? అలా తాగి sex చేసిన లోతు యెహోవా దృష్టిలో నీతిమంతుడు ఎలా అయ్యాడు? మందు తాగినందుకు లోతుకి పడిన శిక్ష ఏమిటి?
- మొదటి రోజు రాత్రి పెద్ద కూతురు వచ్చింది. తాగించి రేప్ చేసి పోయింది. మళ్లీ రెండో రోజు రాత్రి రెండో కూతురు వచ్చి, మందు తాగించి మళ్లీ రేప్ చేసినప్పుడు కూడా ఆ తండ్రికి తెలియలేదా? రేప్ చేసిన కూతుళ్ళని రాళ్లతో కొట్టి చంపించలేదు యెహోవా. ఎందుకు?
- వ్యభిచారం చేసి ఇద్దరు కూతుళ్లు ఇద్దరు మగపిల్లల్ని కన్నారు. వ్యభిచారం వలన పుట్టిన పిల్లల్ని యెహోవా ఎందుకు చంపేయలేదు? వ్యభిచారం వలన పుట్టిన పిల్లల్ని చంపేయడం యెహోవా దావీదు విషయంలో చేసి చూపించాడు కదా!
- ఈ తండ్రి కూతుళ్లు sex చేసే సమయానికి కొద్ది సేపటి ముందు లోతు భార్యని యెహోవా ఎందుకు చంపేశాడు? అలా చంపకుండా ఉంది ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు కదా?
- ఈ తండ్రి కూతుళ్ళ sex సన్నివేశం జరగక ముందు, అదే కూతుళ్ళని రేప్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ఊరి జనాలకి అప్పజెప్పబోయిన లోతు అనే ఈ తండ్రికి అసలు తన కూతుళ్లపైన సగటు తండ్రికి ఉండే ప్రేమ, కరుణ ఉన్నాయా? వాళ్లని తన ఆస్తిగా మాత్రమే చూసేవాడా?
- వ్యభిచారం వలన పుట్టిన ఆ ఇద్దరు పిల్లలు రెండు వంశాలు గా పెరిగారు. పాపము వలన ఒక జాతి అభివృద్ధి కాబోతుంటే యెహోవా సపోర్ట్ చేయవచ్చా?
వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.(ఆదికాండం 19:37)
చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమి్మ అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.(ఆదికాండం 19:38)
- లోతు కూతుళ్లు తప్పు చేయడానికి చెప్పుకున్న కారణం.. “సర్వలోక మర్యాద… ” అసలు ఏమిటా సర్వలోక మర్యాద ? వాళ్లు ఎవరిని పెళ్లి చేసుకోవాలి?
అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.(ఆదికాండము 19:31)
ఇజ్రాయెల్ వాళ్లు ఇజ్రాయెల్ వాళ్ళతోనే పెళ్లిళ్లు చేసుకోవాలి. అదేగా సర్వలోక మర్యాద? తమ జాతి వాళ్లు లేరు కాబట్టి నాన్నతోనే పిల్లల్ని కనడమా? సర్వ లోకపు మర్యాద?
చెప్పండి.. ఇంత దుర్మార్గం జరిగితే యెహోవా స్పందించిన తీరు సరి అయినదేనా?