పవన్ కళ్యాణ్ గారి వీడియో సందేశం స్ఫూర్తిగా తీసుకొని, తిరుక్షేత్రల రక్షణ సమితి ఓంకార్ గారి తో కలిసి తిరుపతి జనసేన సభ్యులు Retd Excise Superintendant గోరా వెంకటరమణ వారి కుమారుడు ఆస్ట్రేలియా నివాసి గోరా రాజేష్
ప్రైవేట్ స్థలములో గణపతి ఉత్సవాలు
గణపతి ఉత్సవాలు ప్రైవేట్ స్థలముల నందు covid నిబంధనలు పాటిస్తూ మండపము లోపల 5 మందికి మించకుండా జరుపుకొనుటకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో లంచ్ మోషన్ ఫైల్ చెయ్యడం జరిగింది. తీర్పు అనుకూలంగా వచ్చినది. తీర్పు కాపీ రేపు హై కోర్ట్ నుండి అందిన వెంటనే అందరికి షేర్ చెయ్యడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనల వర్తింపు
తీర్పు పిటిషనర్ తుమ్మ ఓంకార్ గారు పేరు మీద ఫైల్ చేసినప్పటికీ అదే నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకొనవచ్చు.హై కోర్టు పరిధి రాష్ట్ర వ్యాప్తంగా కావున అవే నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్తించును అని గమనించగలరు.