Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

పెద్దమనిషి అయిన ప్రతి అమ్మాయి దగ్గర నుండి ప్రతి నెల రెండు పావురాలు వసూలు చేసిన బైబిల్ దేవుడు!

పెద్దమనిషి అయిన ప్రతి అమ్మాయి దగ్గర నుండి ప్రతి నెల రెండు పావురాలు వసూలు చేసిన బైబిల్ దేవుడు!

స్త్రీలు ‘డేట్’ అవ్వడాన్ని బూచిగా చూపించి బలులు అర్పించమని ఆర్డర్ వేసిన బైబిల్ దేవుడు

యెహోవా దృష్టిలో పీరియడ్స్ వచ్చిన అమ్మాయి అపవిత్రురాలు

స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు. (లేవీయకాండము 15:19)

“`When a woman has her regular flow of blood, the impurity of her monthly period will last seven days, and anyone who touches her will be unclean till evening.(Leviticus 15:19)

ఆమెని ముట్టుకున్నా కూడా మనుషులు అపవిత్రమైపోతారు అంటున్నాడు యెహోవా.

సరే, మరి ఏం చేస్తే అపవిత్రత పోయింది పవిత్రత వస్తుంది?

పాపం పోవాలంటే పావురాలు బలివ్వాల్సిందే!

ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. (లేవీయకాండము 15:29-30)

ఏమిటో ఈ పిచ్చి నియమాలు అనుకోని నియమం తప్పితే చంపేస్తా అంటున్నాడు యెహోవా.

ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.( లేవీయకాండము 15:31)

ఇలా ప్రతి ఆడపిల్ల దగ్గర నుండి ఎన్ని పావురాలు బలి పరిహారం తీసుకుని ఉంటాడు యెహోవా? ఏమో..లెక్కించలేని సంఖ్య.

పిల్లలు కన్న తల్లి కూడా అపవిత్రురాలే! అందులోనూ ఆడపిల్లని కంటే రెండు డబల్ పాపి.

ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను. (లేవీయకాండము 12:5)

If she gives birth to a daughter, for two weeks the woman will be unclean, as during her period. Then she must wait sixty-six days to be purified from her bleeding. (Leviticus 12:5)

మగబిడ్డని కంటే ఇందులో సగం పాపి!

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండ వలెను.(లేవీయకాండము 12:2)

మేరీ దగ్గర పాప పరిహార బలి తీసుకున్న యెహోవా!

మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును

ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి. (లూకా 2:22:24)

మిగతా ఆడాళ్లంటే పాపులు అనుకోవచ్చు, మరి మేరీ చేసిన పాపం ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *