![May be an image of 1 person, beard and text that says "ఎక్కువ స్త్రీలని పెళ్లి చేసుకోకూడదు దేవుడేఆడాళ్లని తార్చితే వాడుకోవాలి తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగార ములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు. [ద్వితీయోపదేశకాండము 17:17] నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. (2 సమూయేలు 12:8) Ramana Nationalist ఏం మాట్లాడుతున్నవురా నరాలు కట్ అయిపి అయిపోయిని"](https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t39.30808-6/258854978_260296252785407_7546601194813625860_n.jpg?_nc_cat=100&ccb=1-5&_nc_sid=8bfeb9&_nc_ohc=8utMPj-BfEQAX9LuP8q&_nc_ht=scontent.fhyd2-1.fna&oh=0d9fbc5af5657b3948d1b18da405b8e4&oe=619BE597)
ఎక్కువ మంది స్త్రీలని పెళ్లి చేసుకోకూడదు కానీ దేవుడే ఆడాళ్ళని తార్చితే వాడుకోవచ్చు.
స్టేట్మెంట్ – 1
తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగార ములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు. (ద్వితీయోపదేశకాండము 17:17)
స్టేట్మెంట్ -2
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.
(2 సమూయేలు 12:8)
వివరణ :
బైబిల్ లో దావీదుని సెటిల్ చేయడానికి యెహోవా పడిన కష్టం అంతా ఇంతా కాదు. దావీదుని సుఖ పెట్టడానికి యెహోవా నానా తంటాలు పడ్డాడు. అమ్మాయిల్ని సప్లై చేశాడు. పెళ్లిళ్లు చేశాడు. పురుషాంగం చర్మాలను ఏరుకు రావడంలో సహాయం చేయడం. ఒకటా రెండా… యెహోవా కష్టం అంతా ఇంతా కాదు. కంప్లీట్ పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తాడు యెహోవా. ఇంతకీ పెళ్లిళ్ల పేరయ్య పాత్రలో యెహోవా సక్సెస్ అయ్యాడా? లేదా?
Context :
బైబిల్లో యెహోవా దావీదు అనే వాడిని రాజుని చేస్తాడు. అలాగే ఎంతో మంది ఆడవాళ్ళని దావీదుకి అప్పజెప్పుతాడు కూడా. కానీ దావీదు హితీయుడు అయిన ఊరియా భార్యను మోహించి పెళ్లాడతాడు. అలాగే ఆమె భర్తను చంపేస్తాడు.
అప్పుడు దావీదు దగ్గరకి నాతాను అనే ప్రవక్త వచ్చి.. యెహోవా తనతో పంపిన విషయాన్ని దావీదుతో పంచుకుంటాడు.
యెహోవా ఇలా చెప్పాడు:
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. (2 సమోయేలు 12:8)
I gave your master-s house to you, and your master-s wives into your arms. I gave you the house of Israel and Judah. And if all this had been too little, I would have given you even more.
Master wives = Saul wives
Saul = father in law of David
అర్ధం అయింది కదా.. ఇప్పటికే చాలా మంది స్త్రీలను ( నీ మామ భార్యలతో సహా ) నీకు అప్పజెప్పాను. చాలదంటావా ఇంకా ఇస్తాను అని యెహోవా దావీదు కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
అయితే మామ భార్యలను అల్లుడికి ఇవ్వడం న్యాయమా కాదా? అనే చర్చ ఇక్కడ చేయడల్చుకోవడం లేదు ఎందుకు అంటే కోడలు (తామారు) మామ (యూదా) దగ్గర పడుకున్నా కూడా ఏమీ చేయని యెహోవా, దావీదు తన అత్త దగ్గర పడుకుంటే తప్పు పడతాడని నేను అనుకోను.
అయితే ఈ రోజు చర్చించబోతోంది.. ఈ వాక్యంలో చెప్పినట్టు యెహోవా నిజంగానే చాలా మంది ఆడవాళ్ళని దావీదుకి అప్పజెప్పాడా? అయితే ఎంత మందిని అలా దావీదు కౌగిలిలోకి చేర్చాడు?
1. సౌలు తన కూతురు మికాలే ని దావీదు పెళ్లి చేసుకోవాలనుకుంటే అతను 100 మంది మగాళ్ల foreskins (penis ముందు చర్మాలు ) తేవాలని కండిషన్ పెడతాడు. కానీ దావీదు యెహోవా దయతో 200 మంది మగాళ్లను చంపి మామ అడిగిన కట్నం సమర్పించుకుంటాడు.
“గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.”
ఇది యెహోవా సపోర్ట్ తోనే జరిగింది.
“యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి.. (1 సమోయేలు 18:28)
అలా యెహోవా సపోర్ట్ తో సౌలు గారికి అల్లుడు అవుతాడు. సౌలు ఇల్లు దావీదు గుప్పిట్లోకి రావడానికి ఇది మొదటి అడుగు. దీనినే యెహోవా పై వాక్యంలో ప్రస్థావించాడు.
2. నాబాలు అనే దావీదు వ్యతిరేకి ఒకడు ఉంటాడు. అభిగేల్ ( నాబాలు భార్య ) కి దావీదుకి పరిచయం అవుతుంది. ఆమె చాలా అందగత్తె కూడా. అయితే యెహోవా నాబాలుని చంపేస్తాడు. నాబాలు చనిపోయాక దావీదు అభిగేలుని పెళ్లి చేసుకుంటాడు.
“పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.” (1 సమోయేలు 25:38)
“త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను.” (1 సమోయేలు 25:42)
చాలా మంది స్త్రీలను నీ కౌగిలిలోకి చేర్చాను అని యెహోవా చెప్పిన మాట అభిగేలు భర్తను చంపి ఆమెను దావీదుకి అప్పజెప్పడంతో నిజమే అని తేలింది.
3. నీ యజమాని స్త్రీలను ( masters’ wives ) నీ కౌగిట చేర్చాను అన్నాడు యెహోవా.
సౌలు చావుకి కారణం:
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను.” (1 దిన వృత్తాంతములు 10:13).
కాబట్టి సౌలు చావుకి కూడా యెహోవానే కారణం.
ఇక్కడ యజమాని అంటే సౌలు. అంటే దావీదుకి పిల్ల నిచ్చిన మామ. యజమాని భార్యలు అంటే మన తెలుగు వాళ్ళు తప్పు పడతారని యజమాని స్త్రీలు అన్నారు. కానీ ఆంగ్ల బైబిల్ లో master’s wives అని దర్జాగా రాసుకున్నారు.
కొందరు యెహోవా ఇచ్చిన సౌలు భార్యలకి దావీదు కేవలం రక్షకుడిగా ఉన్నాడు అని వాదిస్తారు. కానీ క్రైస్తవులకి ఆ అవకాశం కూడా లేకుండా చేసింది ఈ బైబిల్ వచనం.
అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.(2 సమోయేలు 12:4).
నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే…(2 సమోయేలు 12:7)
తన దగ్గర ఉన్న సంపదను కాకుండా వేరే వాడి ( పేదవాడి ) సంపదను ముట్టుకున్నాడు. ఇక్కడ దావీదు దగ్గర ఉన్న సంపద అతని భార్యలు, ఊరియా పేదవాడు . వాడికి ఒక్కటే భార్య. యెహోవా ఇచ్చిన సంపద చాలా ఉండగా ఇలా కక్కుర్తి పడటం తప్పే.. మరి అంత మంది భార్యల్ని, ఉంపుడుగత్తెలని, మామ పెళ్లాలని దావీదు దగ్గర అప్పజెప్పడం తప్పు కాదా?
సంపద ఉండేది అనుభవించడానికే కాబట్టి నాతాను /యెహోవా ఇచ్చిన ఉదాహరణని బట్టి సౌలు భార్యలను దావీదుకి అనుభవించడానికే ఇచ్చాడు తప్ప వేరే కాదు.
అయినా స్త్రీలను భోగవస్తువు /సంపద అని ఉదహరించడం కూడా తప్పే!
4. దావీదుకి 8 మంది భార్యలు అని బైబిల్ లో చెప్పబడింది. కానీ అంతకు మించిన ఉంపుడుగత్తెలు దావీదు దగ్గర ఉండే వాళ్ళు అని తెలుస్తోంది.
దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి. (2 సమోయేలు 5:13).
ఇంకా కావాలంటే అడుగు ఎంత మందినైనా ఇస్తా అనే ఈ ఒక్క మాటతో దావీదు చేసుకున్న 8 భార్యలు + ఉంపుడుగత్తెలలో యెహోవా హస్తం ఖచ్చితంగా ఉంది అని చెప్పాల్సి వస్తోంది.
దావీదుకి సౌలు రాజ్యం, అతని ఇల్లు, మామ భార్యలు, సొంత భార్యలు, నాబాలు లాంటి పరాయి వాడి భార్యలు ఇంకా ఉంపుడు గత్తెలను ఇచ్చి.. ఇవి సరిపోక పోతే ఇంకా ఇస్తాను అన్న యెహోవా ఇంతకీ దావీదుని చెడ గొడుతున్నాడా? బాగు చేస్తున్నాడా?
ఏదేమైనా పెళ్లిళ్ల పేరయ్య పాత్రలో యెహోవా జీవించాడనే చెప్పాలి. కానీ సందేహం ఏమిటంటే యెహోవా తాను దేవుడు అన్న సంగతి మరచి ఇలాంటి బ్రో.. పనులు ఎందుకు చేస్తాడు?