చర్చి వ్యవస్థ మూడు వాక్యాల్లో..!
చర్చికి వచ్చే క్రైస్తవులకి బాగా కష్టపడాలి అని నేర్పుతారు. మంచి ఇన్స్పిరేషన్ కోసం దావీదు గొర్రెల కాపరి నుండి రాజు ఎలా అయ్యాడు.. ఫలానా వ్యక్తి కస్టపడి ఎలా పైకి వచ్చాడు. ఇలాంటి కథలెన్నో చెప్తారు. దెబ్బకి గొర్రెలకి అయ్యగారు పెద్ద మోటివేషన్ స్పీకర్ లా కనిపిస్తాడు. జాబ్ మోటివేషన్ కి పనికొచ్చే వాక్యం.
బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. (సామెతలు 10:4)
ఇలాంటి వాక్యాలు కొన్ని రోజుల పాటు చెప్పిన తర్వాత ఒకవేళ గొర్రెగాడికి మంచి జాబ్ వస్తే అప్పుడు బైబిల్ నుండి మరో వాక్యాన్ని బయటకి తీస్తారు.
నీ సంపాదనలో నుండి 10%( దశమ భాగం ) దేవుడుకి ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు దొంగవి అని. దెబ్బకి మనోడు 10% పాస్టర్ గారి చేతిలో పెడతాడు.
మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. (మలాకీ 3:8)
అలా ఏ పని చెయ్యకుండానే పాస్టర్ గారికి డబ్బు చేతికి వస్తుంది. తన పెళ్ళాం పిల్లల్ని గొప్ప గొప్ప స్కూల్స్, కాలేజీలలో చదివించుకుంటూ మంచి వాహనాలలో తిరుగుతూ జీవితం సాగిస్తాడు.
పాస్టర్ గారికి కూడా ఇన్స్పిరేషన్ బైబిల్ నుండే లభించడం మరో విశేషం.
మీరు వేకువనే లేచి చాలా రాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.
(కీర్తనల గ్రంథము 127:2)
ఈ వాక్యానికి అర్థం ఏంటంటే.. కస్టపడి జాబ్ చేయడం ఎందుకు? దేవుడు నీకు free గా అన్నీ ఇస్తాడు అని.
ఇలా వాక్యానుసారం జీవిస్తూ గొర్రెలు దశమ భాగాలు ఇవ్వడం, పాస్టర్స్ హ్యాపీ బతకడం, extra income కోసం ఇంకొందరిని మతం మార్చడం..!
నిత్యం చర్చిలో జరిగేది ఇదే..!