యేసు చనిపోయింది మన పాపాల కోసం కాదు. తన పాపాల కోసమే (With Proof )
Blasphemy ( దైవదూషణ )
ఈ చట్టం ప్రకారం యెహోవాని తిట్టినా, దూషించినా వాదిని చంపేయాలి అన్నది యూదుల నియమం.
యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.(లేవీయకాండము 24:16)
యెహోవా ఆలయాన్ని కూల్చేయండి అన్నందుకే యేసుని చంపేశారు యూదులు. ఇంతకీ ఆ మాట ఏసు అన్నాడా లేదా?
ఒక సారి బైబిల్ లో చూద్దాము.
అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దిన ములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి. (మార్కు 14:56-58)
మార్కు సువార్త ప్రకారం యేసు అనలేదు అని రాయబడి ఉంది. పైగా యేసుపైన అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నారు అని మార్కు సువార్త చెప్పుకొచ్చింది.
అయితే యోహాను సువార్త ఇందుకు భిన్నంగా చెప్తుంది. యేసు నేరస్థుడే ( నిజంగానే యెహోవా ఆలయాన్ని కూల్చమన్నాడు యేసు అని ) అని చెప్పుకొచ్చాడు యెహోవా సువార్త రచయిత.
యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. (యోహాను 2:19)
Jesus answered them, “Destroy this temple, and I will raise it again in three days.” ( john 2:19)
ఇంత స్పష్టంగా యేసు చెప్పిన వాక్యం కళ్ల ముందు కనపడుతుంటే యెహోవా అలా అనలేదు అని మార్కు అబద్దం ఎలా చెప్పగలిగాడు?
సరే ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా?
ఉన్నారు!!!
యేసు అమాయకుడు అన్న అదే యోహాను సువార్తలో మరో చోట ఇలా రాయబడి ఉన్నది.
యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.
యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి. (యోహాను 2:19-20)
కాబట్టి యోహాను సువార్త పచ్చి అబద్దం అని తేలిపోయింది.
కాబట్టి యేసు నేరస్తుడని నిరూపణ అయింది.
యెహోవాని కట్టిన /కట్టించిన ఆలయాన్ని కూల్చండి అన్న పాపానికి యేసుకి మరణ శిక్ష పడింది.
యూదులు సంతోష పడ్డారు. తమ దేవుడుకి వ్యతిరేకి అయిన వాడిని శిక్షించుకుని ఊపిరిపీల్చుకున్నారు.
తర్వాత యేసు సిలువపై ఉన్నప్పుడు కొందరు ఇలా అన్నారు.
దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. (మత్తయి 27:40)
అప్పుడు కూడా యేసు సిలువపై కొట్టిన మేకులని తప్పించుకుని పోలేక చనిపోయాడు.
కాబట్టి యేసు సిలువ వేయబడటానికి యేసు చేసిన పాపాలే కారణమని బైబిల్ పరంగానే నిరూపించడం జరిగింది.
పాస్టర్స్ చెప్పే మాయ మాటలు నమ్మకండి.
బైబిల్ చదవండి.