ఉగాది మాత్రమే బైబిల్ న్యూ ఇయర్! Bible New Year and Ugadi

హెబ్రీ క్యాలెండరు లో ఉన్న మొదటి నెల Nisan మాత్రమే నూతన సంవత్సరం అని బైబిల్ చెప్తుంది.

హిందువులు జరుపుకునే ఉగాది నాడే క్రైస్తవులు (యూదులు) కూడా తమ నూతన సంవత్సరాన్ని జరుపుకునే వారు.

LUNI SOLAR CALENDAR ప్రకారం లెక్క కట్టి వసంత మాసం ఆరంభం రోజున యూదులు – హిందువులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు.

NISAN లేదా ROSH CHODESH NISAN అనే పండుగ ఉగాది రోజే వస్తుంది. ఈ సంవత్సరం కూడా రెండు పండుగలు ఏప్రిల్ 1-2 తేదీల్లో వస్తాయి . ఏప్రిల్ 1 సాయంత్రం హిందువులకి కొత్త అమావాస్య పండుగ, మరుసటి రోజు ఉగాది. యూదులకు కూడా ఏప్రిల్ 1 సాయంత్రం నుండు మరుసటి రోజు సాయంత్రం ఘడియల వరకు పండుగ ఉంటుంది. అదే NISAN పండుగ . హిందువుల యూదుల ఉగాది పండుగ.

అయితే ఇప్పుడు ఈ పండుగ యూదులు జరుపుకోవడం లేదు. మరో 7 నెలల తర్వాత వచ్చే ….. పండుగను తమ నూతన CIVIC NEW YEAR గా జరుపుకుంటారు. ఆరోజున ఆపిల్ ముక్కలని తేనెలో ముంచుకుని తింటారు. తినిపించుకుంటారు. ఇది కూడా ఉగాది ఉగాది లాంటిదే. అంటే యూదుల మూలాలు హైందవంలో ఉన్నాయని గుర్తించాలి.

అయితే యెహోవా యూదుల నూతన సంవతసరం అమావాస్య నాడు తనకి బలి ఎలా ఇవ్వాలో చెప్తూ కొత్త సంవత్సరం గురుంచి బైబిల్ లో ప్రస్తావించాడు.

ఆ రెఫరెన్సెస్ కూడా ఇస్తున్నాను చూడండి.

నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో-ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను. (నిర్గమకాండము 12:1- 4)

అయితే ఇందులో చిన్న తిరకాసు ఉంది . అసలు యూదులు నూతన సంవత్సరం ఎందుకు జరుపుకుంటారు?

ఉగాది రోజునే ఎందుకు జరుపుకుంటారు?

ఈ ప్రశాంకు మీరు ఖచ్చితంగా సమాధానం తెలుసుకోవాలి .

హవ్వ ఆదాములని సృష్టి చేసిన రోజే ఉగాది/NISAN.

Rosh Chodesh Nisan for Hebrew Year 5782 begins at sundown on Friday, 1 April 2022 and ends at nightfall on Saturday, 2 April 2022.

3761 BC

The starting point of Hebrew chronology is the year 3761 BC, the date for the creation of the world as described in the Old Testament. The Jewish calendar is luni-solar, based on lunar months of 29 days alternating with 30 days. An extra month is intercalated every 3 years, based on a cycle of 19 years.

https://web.library.yale.edu/cataloging/hebraica/about-hebrew-calendar

సృష్టి గురించి వారి అజ్ఞానము ఎలా ఉన్నా, వారి నూతన సంవత్సరం మాత్రం ఉగాది అని తెలిసిపోతుంది.

అయితే ఇప్పుడు 7 నెలలో న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు యూదులు.

మళ్ళీ 7 అనగానే జూలై అనుకుంటారేమో!

అది సెప్టెంబర్!

మార్చి నుండి 7 నెల సెప్టెంబర్ కదా!

సప్తమి అనే సంస్కృత పదం నుండి వచ్చిందే సెప్టెంబర్. ఆ నెలలో కూడా Civic new year చేస్తారు యూదులు.

సెప్టెంబర్ – సప్తమి -7 వ నెల
అక్టోబర్ – అష్టమి – 8 వ నెల
నవంబర్ – నవమి – 9 వ నెల
డిసెంబర్ – దశమి – 10 వ నెల

ఇలా బైబిల్ మూలాలే కాదు అందరి మూలాలు మన భారత దేశం నుండే అని చెప్పడానికి కూడా ఈ బైబిల్ క్యాలెండరు ఒకటి చాలు.

కాని దరిద్రం ఏమిటంటే మతం మారిన మాజీ హిందువులు, క్రైస్తవులు అసలు తమకు కాని, క్రైస్తవానికి కాని ఎటువంటి సంబంధం లేని జనవరి 1 కొత్త సంవత్సరం అని గోల గోల చేస్తున్నారు.

క్రైస్తవులు బైబిల్ చదవరు. అదే ప్రధాన సమస్య.

మరిన్ని వివరాలకి కింద links ఇస్తున్నాను చూడండి.

References :

https://www.google.com/amp/s/www.calendar.com/blog/introduction-to-the-hebrew-calendar-12-facts-you-should-know/amp/

https://www.shiva.com/learning-center/commemorate/jewish-calendar-info/

https://en.m.wikipedia.org/wiki/Hebrew_calendaamp

Hebrew New Year

https://www.hebcal.com/holidays/rosh-chodesh-nisan-2022
Udadi 2022

https://panchang.astrosage.com/festival/ugadi/ugadi?date=2022&language=en&view=amp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *