Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

ప్లీజ్ డాడీ.. నన్ను చంపొద్దు..!

వేడుకున్న యేసు వేటు వేసిన యెహోవా

తన తండ్రి అయిన యెహోవాని యేసు ఇలా వేడుకున్నాడు.

కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. (మత్తయి 26:39)

Going a little farther, he fell with his face to the ground and prayed, “My Father, if it is possible, may this cup be taken from me. Yet not as I will, but as you will.” (Matthew 26:39)

బైబిల్ దేవునికి అన్నీ సాధ్యమే.. పాపాలు తొలగించడం కూడా సాధ్యమే. కానీ ఒక్క నియమం వలన యేసుని చంపాల్సి వచ్చింది.

మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. (హెబ్రీయులకు 9:22)

పాపం పోవాలంటే మేకనో గొర్రెనో బలి ఇవ్వాలి. కానీ మనిషిని బలివ్వడం ఏంటి?

ఎందుకు అంటే యేసు ఒక స్పెషల్ గొర్రె అంట.

అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా..! (1 పేతురు 1:19)

సరే మేకనో గొర్రెనో చంపి పాపాలు పోగొట్టవచ్చు కదా! లేదు నాయనా.. నువ్వో స్పెషల్ గొర్రెవి…

అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా..! (1 పేతురు 1:19)

గిన్నె/పాత్ర అంటే యెహోవా యొక్క ఉగ్రత అని చెప్పే మరిన్ని బైబిల్ వాక్యాలు.

ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.(ప్రకటన గ్రంథము 14:10)

he, too, will drink of the wine of God-s fury, which has been poured full strength into the cup of his wrath. He will be tormented with burning sulphur in the presence of the holy angels and of the Lamb. (Revelation 14:10)

పై వాక్యంలో ఉగ్రత పాత్ర గురించి మీరు చూడవచ్చు.

  1. cup= యెహోవా ఉగ్రత

ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు. (1 థెస్సలొనీకయులకు 5:9)

  1. cup=యెహోవా ఉగ్రత

యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.(ర్తనల గ్రంథము 75:8)

కాబట్టి యేసుని యెహోవా చంపక తప్ప లేదు.

యేసు ఎంత వేడుకున్నా యెహోవా వినలేదు. యేసుని పాపశరీరుడిగా పుట్టించి చంపేశాడు.

దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. (రోమీయులకు8:4 )

యేసుని చంపింది యెహోవా అని చెప్పే మరికొన్ని బైబిల్ వాక్యాలు:

యేసుని చంపింది యెహోవానే అనడానికి రుజువులు ఇవిగో..

వీటి ఆధారంగా బైబిల్లో దేవుడు అయిన యెహోవా మరో దేవుడు అయిన యేసుని చంపేశాడు మనుషుల పాపాల కోసం. కాని ఇప్పటికీ పాపం పోలేదు. అది వేరే సంగతి.!

  1. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రతనుండి రక్షింప బడుదుము.(రోమీయులకు 5:9)

Since we have now been justified by his blood, how much more shall we be saved from God-s wrath through him! (Romans 5:9).

  1. క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.( రోమీయులకి 3:25).

God presented him as a sacrifice of atonement, through faith in his blood. He did this to demonstrate his justice, because in his forbearance he had left the sins committed beforehand unpunished–(Romans 3:25).

  1. తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు? (రోమీయులకు 8:32)

He who did not spare his own Son, but gave him up for us all–how will he not also, along with him, graciously give us all things? (Romans 8:32)

కొడుకు ఎంత వేడుకున్న ఒక తండ్రిగా యెహోవా కనికరించకపోవడం కడు విచారకరం కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *