
మానవ శరీరాలకి స్వర్గంలో ఏం పని ?

అసలు స్వర్గంలోకి మానవ శరీరాలు ప్రవేశించగలవా?
యేసు స్వర్గంలో ఉన్నాడా? ఒకవేళ యేసు స్వర్గంలో మానవ శరీరంతోనే ఉంటే ఇప్పటికీ అతను మనిషే అవుతాడు తప్ప దేవుడు కాదు.
ఇప్పటికీ యేసు మేరీ పుత్రుడేనా ?
ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం
- స్వర్గంలో మానవ శరీరాలకి ఏం పని ?
స్వర్గంలో ఆత్మలకి ఉన్న ఏకైక పని యెహోవాని పొగుడుతూ పాటలు పాడటం. అంతకు మించి వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. యేసు యెహోవా కుడి పక్కన మానవ శరీరంతో కుర్చీ వేసుకుని కూర్చుని యముడి పక్కన చిత్రగుప్తుడిలా పాపాల పద్దుల బుక్కు రాయడం చేస్తూ ఉండవచ్చు .
- అసలు స్వర్గంలోకి మానవ శరీరాలు ప్రవేశించగలవా?
సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభ వించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలుల నర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును. (ప్రసంగి 9:2)
All share a common destiny–the righteous and the wicked, the good and the bad, the clean and the unclean, those who offer sacrifices and those who do not. As it is with the good man, so with the sinner; as it is with those who take oaths, so with those who are afraid to take them. (Ecclesiastes 9:2)
కాబట్టి పవిత్రులైనా, అపవిత్రరులైనా అందరూ ఒకరోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే అంటున్నాడు యెహోవా.
చచ్చాక ఏమవుతుంది ?
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. (హెబ్రీయులకు 9:27)
Just as man is destined to die once, and after that to face judgment. (Hebrews 9:27)
అంటే పుట్టడం, చావడం, లేపబడటం అందరికీ కామన్.
అయితే ఇందుకు విరుద్ధంగా బైబిల్లో కొందరు రెండు సార్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
లాజరు చనిపోయి యెహోవా వలన బతికించబడ్డాడు కాబట్టి అతను రెండు సార్లు చనిపోయాడు.
అంటే మనిషి ఒక్కసారే చనిపోతారు అని బైబిల్ చెప్పిన వాక్యం తప్పు ఐంది అని బైబిల్ ఒప్పుకుంది .
ఇక అందరూ చనిపోవలసిందే చెప్పిన బైబిల్ వాక్యం (ప్రసంగి 9:2) కూడా తప్పు అయ్యింది. ఎలా అంటే యేసు, హనోకు ఏలీయా మొదలైన వాళ్ళు ఇంకా చావలేదు.
చావకుండా స్వర్గానికి వెళ్లిపోయారు.
హనోకు చావలేదు:
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు. (హెబ్రీయులకు 11:5)
ఏలీయా చావలేదు:
వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను. (2 రాజులు 2:11)
యేసు కూడా చావలేదు:
ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను. (అపో. కార్యములు 1:9)
కాబట్టి హనోకు, ఏలీయా, యేసు మొదలైన వాళ్ళు ఇంకా మానవ శరీరాలతో స్వర్గంలో ఉన్నారు.
అందరూ చనిపోవాల్సిందే ఎంత గొప్ప వాళ్ళు ,ఉత్తములు , పరిశుద్ధులు అయినప్పటికీ అన్న (ప్రసంగి 9:2) కూడా తప్పు అయ్యింది అని తేలిపోయింది.
సరే ఇక ఆఖరి ప్రశ్న
- యేసు ఇప్పటికీ మేరీ పుత్రుడేనా ? మనిషేనా ?
అవును. యేసు ఇప్పటికీ మేరీ కి కొడుకే. మేరీ శరీరాన్ని పంచుకుని యేసు ఆమె కొడుకే. ఆమె ఇచ్చిన శరీరం తోనే, ఆమె పలు తాగిన శరీరం తోనే యేసు స్వర్గం లో యెహోవా పక్కన కూర్చొని పద్దులు రాస్తున్నాడు
అంటే యేసు ఇప్పటికీ దేవుడు కాదు. యేసు ఎప్పటికీ మనిషే .
యెహోవా ఒక్కడే బైబిల్ ప్రకారం దేవుడు.