
దిష్టి అనేది లేదంటున్నారు విజయ్ ప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ గారు.
వీడియో link
బైబిల్ లో దిష్టి తీయడం ఉందా? ఉంది ఖచ్చితంగా ఉంది కాకపోతే దిష్టి అనే పదం మాత్రం ఉండదు.
ఒక మనిషికి కుష్ఠు రోగం వచ్చి నయం అయ్యాక అతనికి ఇకపై మరోసారి అలాంటి రోగాలు రాకుండా దిష్టి తీయడం బైబిల్ లో ఉంది.
అయితే ఉప్పుతోనో, నిమ్మకాయతోనో కాకుండా పావురాలతో దిష్టి తీస్తారు.
రెండు పావురాల్లను తీసుకొని, ఒకదాన్ని చంపేయాలి. చనిపోయిన పావురం యొక్క రక్తంలో రెండో దాన్ని ముంచి ఏడు సార్లు దిష్టి తీసి పావురాన్ని వదిలేయాలి. దీన్ని దిష్టి అని కాక ఏమంటారు?
హిందువుల్లో చాలా మంది కోళ్లను దిష్టి తీస్తారు.
ఈ క్రింది వచనాలు చూడండి.
లేవీయకాండం 14:4 నుండి 14-7
యాజకుడు పవి త్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.
అప్పుడు యాజకుడు పారు నీటిపైని మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి
కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణ యించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను.
ఇప్పుడు అర్థం అయ్యిందా? బైబిల్ చదవని పాస్టర్లు చాలా మందే ఉంటారు అనడానికి ఈ విజయ్ ప్రసాద్ గారే ఒక మంచి ఉదాహరణ. హిందువులు చేసే ప్రతి దాన్ని ఖండించాలని చూసే ముందు బైబిల్లో ఏముందో చూసి మాట్లాడాలి.
దిష్టి తీయడం వలన ఆ పక్షి ప్రాణం పోతుంది తప్ప ఆ మనిషికి ఒరిగేది ఏమీ లేదు. కానీ బైబిల్ ప్రకారం జంతుబలి జరగనిదే పాపం పోదు. రోగం పోదు. ఎందుకు అంటే రోగాలు పాపం వలన వస్తాయి.
హిందువుల్లో non – veg తినేవాళ్లకి ఈ కోళ్లతో దిష్టి తీసే అలవాటు ఉన్నట్టే.. బైబిల్ దేవుడికి కూడా జంతుబలి ఆచారం ఉంది.
అయినా పక్షి రక్తంలో పక్షిని ముంచి దిష్టి తీయడం ఏమిటి ఛండాలంగా.. పైగా అలా చేయమని యెహోవా చెప్పడం ఏమిటి?
ఈ దిష్టి తీసే తతంగం అయిపోగానే as it is గా జంతు బలి ఇమ్మన్నాడు యెహోవా.!
లేవీయకాండం 14:13
అతడు పాపపరి హారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైనదానివలె అపరాధపరి హారార్థ మైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.
లేవీయకాండం 14:14
అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్త ములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.
చూశారుగా జంతు బలి ఇచ్చాక ఆ జంతువు రక్తాన్ని రోగి యొక్క చెవులకి రాయాలాంట!!
ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దరిద్రంగా ఉంటుంది కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను