Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

అంతా అబద్ధం యేసు లేవడం, కనపటం, కొన్ని రోజులు భూమి పైన ఉండటం అంతా అబద్దం. Ramana Nationalist

యేసు నిజంగానే చనిపోయి లేచాడా?

ఆ విషయాలని అప్పటి కాలం రచయితలు కళ్లారా చూసి ఆ విషయాలని బైబిల్లో రాశారా ?ఈ విషయాలని తెలుసుకోవాలంటే మొదట బైబిల్ తెరవండి.

ఎన్నో విస్తుపోయే నిజాలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రాయబడిన యేసు పునరుద్ధాన కట్టు కథలు మీ మనసుని గందరగోళంలో పడేస్తాయి. ఇవన్నీ చదివిన తరవాత యేసు నిజంగానే చచ్చి లేచాడా? అనే అనుమానం రాకమానదు.

ఈస్టర్ గందరగోళంలో ఒక్కో రచయిత ఎలా చెప్పుకొచ్చాడో చూడండి.

1. మహిళలు ఏ సమయంలో సమాధిని సందర్శించారు?

మత్తయి 28:1 ఆదివారమున, తెల్లవారుచుండగా విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.

మార్కు 16:2: సూర్యోదయం అయినప్పుడు వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా.

లూకా 24:1: ఆదివారమున తెల్లవారుచుండగాఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి

యోహాను 20:1: ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.

2. యేసు సమాధిని చూడటానికి వచ్చిన స్త్రీలు ఎవరు?

మత్తయి 28:1: మగ్దలేనే మరియయు వేరొక మరియయు

మార్కు 16:1: మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి

లూకా 24:10 : మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.

యోహాను 20:1 : మగ్దలేనే మరియ3. వాళ్ళు సమాధి దగ్గరకి వచ్చేసరికి సమాధి ఎలా ఉంది ?మత్తయి 28:2: దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెనుమార్కు 16:4 రాయి పొర్లింపబడి యుండుట చూచిరి

లూకా 24:2 : దొరలింప బడియుండుట చూచియోహాను 20:1: సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.

4. వారు వచ్చినప్పుడు సమాధి వద్ద ఎవరు ఉన్నారు?

మత్తయి 28:2-7 : ఒక దూత మార్కు 16:5: తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడులూకా 24:4 ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు

యోహాను 20:12 యిద్దరు దేవదూతలు5. ఈ దూతలు ఎక్కడ ఉన్నారు?మత్తయి 28:2: రాయి మీదమార్కు 16:5 : రాయి కుడివైపున

లూకా 24:4 : వారియొద్ద నిలువబడిరి

యోహాను 20:12 : తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను.

6. దూత(లు) ఏమి చెప్పారు?

మత్తయి 28:5-7దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి, త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

మార్కు 16:6-7అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను.

లూకా 24:5వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు…

యోహాను 20:13: వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమెనా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.

7. ఏం జరిగిందో మహిళలు చెప్పారా?

మత్తయి 28:8 : అవును

మార్కు 16:8 : చెప్పలేదు (వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు)

లూకా 4:9, 22-24: అవును(సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.)

యోహాను 20: 18: అవునుమగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

8. సమాధి దగ్గరకి వచ్చిన స్త్రీల తర్వాత, యేసు మొదట ఎవరికి కనిపించాడు?మత్తయి 28:16: పదకొండు మంది శిస్యులకి (పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.)

మార్కు 16:12,14: మొదటి ఊరిలోని ఇద్దరికి, తర్వాత 11 మంది శిష్యులకి (ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను.

మార్కు 16:12)వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.(మార్కు 16:13)పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.(మార్కు 16:14)

లూకా 24:13,36: ఎమ్మాయు గ్రామములో ఇద్దరు శిస్యులకు , తర్వాత 11 మంది శిష్యులకి

యోహాను 20:19, 24: పది మంది శిష్యులకు (యూదా మరియు తోమా వారిలో లేరు )[యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను

(యోహాను 20: 24. )]I Corinthians 15:5:

పౌలు గారి మాట ప్రకారంఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.(1 కోరింథీయులకు 15:5)12 మంది ? యూదా చనిపోయాడు కదా ?

9. యేసు మొదట శిష్యులకు ఎక్కడ కనిపించాడు?మత్తయి 28:16-17: గలిలయలోని కొండ పైన (60-100 మైళ్ళ దూరం )

మార్కు 16:12, 14: ఇద్దరికి ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, పిమ్మట పదునొకండుమంది శిష్యులు (భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై…)

లూకా 24:31, 36 : ఎమ్మాయి లో సాయంత్రం (7 మైళ్ళ దూరం ) తర్వాత మరికొందరికి జెరూసలేం గదిలో రాత్రి పూట.యోహాను 20:19 : ఆదివారము సాయంకాలమున

10. పునరుత్థానం తర్వాత యేసును తాకవచ్చా?

మత్తయి 28:9: ముట్టుకున్నారు [యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను.వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా .. (మత్తయి 28:9)]యోహాను 20:17: ఆయన్ని ముట్టుకోకూడదు

యోహాను 20:27: ఆయన్ని ముట్టుకున్నారు (నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి )

11. యేసు కొంతకాలం భూమిపై ఉన్నాడా?

మార్కు 16:19: లేడు, ఆదివారం రోజే పైకి పోయాడు (స్వర్గానికి )

లూకా 24:50-52 : లేడు ఆదివారం రోజే పైకి పోయాడు (స్వర్గానికి )

యోహాను 20:26, 21:1-22: ఉన్నాడు , కనీశం 8 రోజులైనా

అపొ. కార్యములు 1:3 : 40 రోజులు భూమి పై ఉన్నాడు ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.

12. ఆరోహణం ఎక్కడ జరిగింది?మత్తయి : ఆరోహణ జరిగినట్టు లేదు. గెలిలీ కొండపైన ఉండగానే చాప్టర్ పుస్తక సమాప్తం

మార్కు 16:19: జెరూసలేం లోపల కానీ బయట కానీ

లూకా 24:50-51: బెథానీలో (జెరూసలేం కి బాగా దగ్గర ) రాత్రి భోజన సమయం తర్వాత

యోహాను : ఆరోహణం ప్రస్తావన లేదు పౌలు : ఆరోహణ ప్రస్తావన లేదు

అపొ. కార్యములు 1:9-12 : ఒలీవ పర్వతం పైన

గమనిక : పై విషయాలు అన్ని గమనిస్తే ఏ ఒక్క రచయితకి ఏసు ఎప్పుడు సమాధి నుండి లేచాడు? అక్కడ ఏం జరిగింది? అక్కడ ఎవరున్నారు?అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాలపై క్లారిటీ లేదు. వీళ్ళు రాసిన కథల పుస్తకాలని నమ్మి మీ జీవితాలని పణంగా పెడుతున్నారేమో ఆలోచించండి. ఎందుకంటే నిజం అనేది ఎపుడూ ఒకటే ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉండదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *