అవును .. గడపకు నెత్తురు లేకపోతే యెహోవా చంపేస్తాడు. ఫన్నీగా అనిపించినా ఇది నిజం!ఒకప్పుడు బైబిల్ దేవుడు యెహోవా యూదులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు . దాని ప్రకారం యూదులు పస్కా పండుగ (passover ) చేసి, ఒక గోరెనో మేకనో బాలి ఇచ్చి, ఆయా జంతువుల రక్తాన్ని వారికి గడపలకి రాసుకోవాలి. ఆ రక్తపు మరకల్ని చూసి యెహోవా వారిని చంపకుండా వదిలేస్తాడు
ఈ వాక్యాలు చదవండి.నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును. ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను (నిర్గమకాండము 12:6-8)ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను.(నిర్గమకాండము 12:12)మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.(నిర్గమకాండం 12:13)
చూశారు కదా, ఐగుప్తు దేశంలోని అందరినీ చంపడానికి బయలు దేరిన యెహోవా, పస్కా బలి రక్తం పూసిన గడపలను చూసి గుర్తు పడతాను అని చెప్తున్నాడు. ఎందుకు అలా ? గడపకు నెత్తురు పూసి ఉండకపోతే ఎవరు బలిచ్చారో, ఎవరు జంతువుల్ని బలి ఇవ్వలేదో యెహోవా గుర్తు పట్టలేడా?
ఇలా ఏదైనా చూసి గుర్తు పట్టాల్సిన దుస్థితి సర్వాంతర్యామి అయిన దేవుడికి ఉంటుందా?ఎందుకు అంటే దేవుడు సర్వజ్ఞుడు కదా !
గడపకు జంతువుల రక్తం పూయండి. అది చూసి నేను మిమ్మల్ని చంపకుండా వదిలేస్తా అనడం యెహోవా సర్వజ్ఞుడు కాదు అని తెలియజెప్పడం లేదా?
నిజంగా యెహోవా సర్వజ్ఞుడు ఐతే జంతువుల్ని బలి ఇవ్వండి చాలు, నేను మిమ్మల్ని చంపకుండా వదిలేస్తా అనేవాడు. కానీ ఇక్కడ గడపకు నెత్తురు పూయండి. అది “చూసి ” మిమ్మల్ని వదిలేస్తా అంటున్నాడు.
తేడా గమనించండి. ఆలోచించండి మీ రమణ నేషనలిస్ట్