Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

“దేవునితో పెనుగులాట!”


ఆసక్తికరమైన బైబిల్ స్టోరీ మీ కోసం!
ఒకరోజు తన పెళ్ళాం పిల్లలతో పాటు వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు యాకోబు. అందరినీ ఏరు దాటించిన తర్వాత యాకోబు కూడా బయల్దేరుదాం అనుకుంటాడు. ఇంతలో ఎవరో ఒక మనిషి అతన్ని ఆపుతాడు.
యాకోబు వారిని తీసి కొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. (ఆదికాండము 32:23-24)


అప్పుడు ఏం జరిగిందో బైబిల్ వాక్యాల్లో మీరే చదవండి.


తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను. (ఆదికాండము 32:25)
ఆయన-తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు-నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను. (ఆదికాండము 32:26)
ఆయన నీ పేరేమని యడుగగా అతడు- యాకోబు అని చెప్పెను. (ఆదికాండము 32:27)
అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. (ఆదికాండము 32:28)
అప్పుడు యాకోబు-నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన-నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను. (ఆదికాండము 32:29)
యాకోబు-నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.(ఆదికాండము 32:30)
అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను. (ఆదికాండము 32:31)
కథ సమాప్తం!

చూశారు కదా. యాకోబు అనే వ్యక్తి దేవుణ్ణి పెనుగులాటలో / కుస్తీ పోటీలో గెలిచి తనకు ఇశ్రాయేల్ అనే పేరుని ఎలా సంపాదించుకున్నాడు అన్నది ఈ కథలోని సారాంశం .
అంటే బైబిల్ దేవుడు ఒక తుచ్ఛమైన మనిషి చేతిలో ఓడిపోయాడా ? అతన్ని గెలవలేక యెహోవా తొడ మీద కొట్టి చీటింగ్ చేసి తప్పించుకున్నాడా?
ఓడిపోయి తన పేరు కూడా చెప్పకుండా అక్కడ నుండి జారుకున్నాడు ?
ఇలాంటి ప్రశ్నలతో క్రైస్తవులు సతమతమవుతూ ఉంటారు.

ఈ సందేహాలకి సమాధానాలు చూద్దాం.

1. యాకోబు ఉద్దేశ్యంలో దేవుడు అంటే ఎవరు? ఈ వాక్యాలు చూడండి
అప్పుడు యాకోబు-నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా-, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. (ఆదికాండము 32:9-10)
ఈ వాక్యాల ప్రకారం యాకోబు దృష్టిలో దేవుడు అంటే యెహోవానే !
అంటే అతను (ఆదికాండము 32:30 లో )
యాకోబు-నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
అని చెప్పిన వాక్యం యెహోవా గురించే!
ఎందుకు అంటే యెహోవాని ముఖా ముఖిగా ఎవరూ చూడలేరని అతనికి అంతక ముందే తెలుసు. ఆ మాట అబ్రహం కాలం నుండి వాడుకలో ఉంది. కానీ తాను దేవుణ్ణి చూసి కూడా బతికాను అని అతను సంతోషపడుతున్నాడు.

2. యాకోబు నేను దేవుణ్ణి గెలిచాను. నేను దేవుణ్ణి చూశాను అనడానికి కారణం ఏమిటి?
అక్కడకి మనిషి రూపంలో వచ్చిన దేవుడు కన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే !
అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. (ఆదికాండము 32:28)
“నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు “
ఈ మాట పలికిన వ్యక్తి దేవుడు కనుక యాకోబు నేను దేవుణ్ణి చూశాను అనుకున్నాడు.

3. మరి యాకోబు దేవుణ్ణి గెలిచాడా ?
తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను. (ఆదికాండము 32:25)
యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి గురుంచి పైన చెప్పబడింది. అతను యాకోబును గెలవలేక తొడ మీద కొట్టాడు అని. అంటే యాకోబు అప్పటికే అతన్ని గెలిచాడు అని అర్ధం .
పై వాక్యాల ఆధారంగా యాకోబు తాను దేవుణ్ణి గెలిచాను అని కంఫర్మ్ చేసుకున్నాడు. అలాగే అతను దేవుడు అంటున్నది అతని ఉద్దేశ్యంలో యెహోవా గురించే అని ముందే వివరించాను.

4. క్రైస్తవులు చెప్పే మాట ఏమిటంటే యాకోబుతో పెనుగులాడిన ఆ వ్యక్తి యెహోవా కాదు. ఒక దేవదూత అని. మరి దీనికి నీ సమాధానము ఏమిటి?
ఆగండి.. అదీ చెప్తాను.

యాకోబు చేతిలో ఓడిపోయింది క్రైస్తవుల సృష్టి కర్త అయిన యెహోవానే !
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ప్రూఫ్ -1
https://biblehub.com/text/genesis/32-28.htm
ఇక్కడ నేను ఇచ్చిన హీబ్రూ బైబిల్ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ “దేవునితో గెలిచావు” అన్న పదాలకు אֱלֹהִ֛ים (’ĕ-lō-hîm) అనే బైబిల్ దేవుడి పేరు వాడబడింది.
ఇదే אֱלֹהִ֛ים (’ĕ-lō-hîm) అనే పదం దేవుడు అనే అర్ధంలో 680 సార్లకు పైగా హీబ్రూ బైబిల్లో వాడబడింది.
https://biblehub.com/hebrew/elohim_430.htm
ప్రూఫ్ -2
ఆ 680 సందర్భాల్లో ముఖ్యంగా ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించెను దగ్గర మొదలు పెట్టి సౌలు మీదకి దురాత్మని పంపించిన దేవుడు (ELOHIM ) వరకు ఇదే పదం వాడబడింది.
Genesis 1:1HEB: בְּרֵאשִׁ֖ית בָּרָ֣א אֱלֹהִ֑ים אֵ֥ת הַשָּׁמַ֖יִםNAS: In the beginning God createdKJV: In the beginningGod created the heavenINT: in the beginning created God the heavens the earth
אֱלֹהִ֑ים ELOHIM

Genesis 1:2HEB: תְה֑וֹם וְר֣וּחַ אֱלֹהִ֔ים מְרַחֶ֖פֶת עַל־NAS: and the Spirit of God was movingKJV: And the Spirit of God movedINT: of the deep and the Spirit of God was moving over
אֱלֹהִ֑ים ELOHIM

Genesis 1:12HEB: לְמִינֵ֑הוּ וַיַּ֥רְא אֱלֹהִ֖ים כִּי־ טֽוֹב׃NAS: in them, after their kind; and God sawKJV: [was] in itself, after his kind: and God sawINT: their kind saw and God that it was good
אֱלֹהִ֑ים ELOHIM
Judges 4:23HEB: וַיַּכְנַ֤ע אֱלֹהִים֙ בַּיּ֣וֹם הַה֔וּאNAS: So God subdued on that dayKJV: So God subdued on that dayINT: subdued God day he

אֱלֹהִ֑ים ELOHIM
1 Samuel 11:6HEB: וַתִּצְלַ֤ח רֽוּחַ־ אֱלֹהִים֙ עַל־ שָׁא֔וּלNAS: Then the Spirit of God came upon SaulKJV: And the Spirit of God came upon SaulINT: came the Spirit of God upon Saul
אֱלֹהִ֑ים ELOHIM

ఇలా క్రైస్తవులు తమ “దేవుడు” అని బైబిల్లో ప్రస్తావించుకునే 680 సందర్భాల్లో వాడబడిన אֱלֹהִ֑ים ELOHIM అనే పదమే ఇక్కడ కూడా వాడబడింది.
కాబట్టి ఇక్కడ యాకోబు చూసింది, పెనుగులాడింది, గెలిచింది, తప్పించుకుని పారిపోయేలా చేసింది క్రైస్తవులు దేవుడు అయినా యెహోవా నే.
మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పెట్టండి. మరిన్ని ఆధారాలు మరో పోస్ట్ లో పెడతాను.
ఇంకా ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *