Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

దగాపడ్డ దేవుని బిడ్డలు-1

వేశ్యను అమ్మా అని పిలిచినవాడు దేవుడు అయితే .. వేశ్యగా మారిన కూతురుని సజీవ దహనం చేయమన్న వాడిని ఏమనాలి? దెయ్యం అనాలా?

వేశ్యల గురుంచి యెహోవా గారి అభిప్రాయాలు:

  1. కన్న కూతురుని సజీవ దహనం చెయ్యాలి అంటున్న యెహోవా

మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచు కొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. (లేవీయకాండము 21:9)

ఇంకా వేశ్యల గురుంచి యెహోవా ఏమంటున్నాడో చూడండి.

  1. వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. (సామెతలు 23:27-28)
  2. వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.(సామెతలు 22:14)
    ఒకటే మాట రెండు చోట్ల రాయించాడు అంటే వేశ్య అంటేనే పెద్ద గొయ్యి అని యెహోవా బలమైన అభిప్రాయం అని అర్ధం చేసుకోవాల్సి వస్తుంది.
  3. జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది.(సామెతలు 5:3-4)

యెహోవా భక్తుడు అయిన యూదా వ్యభిచారం చేసిన తన కోడలిని ఏం చేద్దాం అనుకున్నాడు?

  1. రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వమువలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా-ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను. (ఆదికాండము 38:24)

ఇలాంటి యెహోవా మనిషిగా పుట్టి మొత్తం అపరిచితుడు లాగా మారిపోయి, గజినీ లాగా మొత్తం మర్చిపోయి ఒక వేశ్యని అమ్మా అని పిలిచాడా?

యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడుఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. (యోహాను 8:10-11)

ఏమిటి కన్నా తల్లినే అమ్మ అని పిలవని యేసు వ్యభిచారిని అమ్మా అని పిలిచాడా ? ఆశ్చర్యంగా ఉందే ?

Jesus straightened up and asked her, “Woman, where are they? Has no-one condemned you?” “No-one, sir,” she said. “Then neither do I condemn you,” Jesus declared. “Go now and leave your life of sin.” (John 8:10-11)

Jesus straightened up and asked her, “Woman… “

women అంటే మదర్ హా ? ఓ స్త్రీ అని అనుకున్నానే.

యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. (యోహాను 19:26)

When Jesus saw his mother there, and the disciple whom he loved standing near by, he said to his mother, “Dear woman, here is your son,” (John 19:26)

మేరీ ని కూడా “Woman… “అనే పిలిచేవాడు కదా ఏసు. ఐతే అమ్మకి వేశ్యకి ఒకే పదం వాడాడు అన్న మాట.
నైస్ నైస్.. !

ఇక ఫైనల్ గ ఒక మాట.

యేసు యెహోవా ఒక్కరే అంటారు కదా క్రైస్తవులు.

అంటే ఒకప్పుడు వేశ్యలను చంపమన్న యెహోవా/యేసు, ఇప్పుడు వేశ్యలను అమ్మా అని పిలవడం మొదలు పెట్టాడా? అంటే ఫుల్ గా మారిపోయాడు అన్నమాట!

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. (హెబ్రీయులకు 13:8)

Jesus Christ is the same yesterday and today and for ever. (Hebrews 13:8)

ఎప్పటికీ ఒకలాగే ఉండేవాడు మనసు ఎందుకు మార్చుకున్నాడు?

యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.(మలాకీ 3:6)

ఎప్పటికీ మార్పులేని యెహోవా ఇప్పుడు సడన్ గా ఎందుకు మారిపోయాడు ?

ఒకప్పుడు వేశ్యలను దుమ్మెత్తి పోసి, సజీవ దహనం చెయ్యమని ఇప్పుడు అమ్మా (women) అని ఎలా పిలిచాడు?

అంటే యెహోవా/యేసు మారిపోయాడు.

అంటే మారాను అని చెప్పి దేవుడు మారిపోయాడు అంటే బైబిల్ ఒట్టి అబద్ధం అనేగా !

సర్… మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు

(కౌంటర్ టు దగాపడ్డ దేవుని భార్య -పార్ట్-1)

ఇంకా ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *