Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పాస్టర్లు చెప్పని బైబిల్ వాక్యాలు-4

మంచి మాట, ముంచే మాట

మనల్ని కన్న తల్లి తండ్రులే మనకు కనిపించే దేవుళ్ళు అని బోధించారు మన పెద్దలు.

కనిపెంచిన తల్లి తండ్రుల మాట వినాలని, వారి మనసు నొప్పించవద్దు అని, ఎవరు చెప్పినా అది మంచి మాటే!

ఉదాహరణకు శ్రీరాముడు పితృ వాక్య పరిపాలకుడు అని మనం చదువుకున్నాం. ఇది ఖచ్చితంగా మంచి మాట.

ఈ బైబిల్ వాక్యం చూడండి.

నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. (సామెతలు 23:22)

Listen to your father, who gave you life, and do not despise your mother when she is old. (Proverbs 23:22)

“కన్న తండ్రి మాట వినాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని విడిచి పెట్టకూడదు. “

ఇలాంటి వాక్యాలు చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, నీ తల్లిని తండ్రినీ విడిచి పెట్టు, నీకు స్వర్గం ఇస్తాను. భూమిపైన ఎన్నో భోగాలు ఇస్తాను అని ఎవరైనా అన్నప్పుడు అంతే.. ఒళ్ళు మండుతుంది.

ఎందుకు అంటే ఇలాంటి మాటలు ఎవరైనా వింటే వారి కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది.

….

ఒక వేళ ఈ రెండు మాటలు ఒకే వ్యక్తి చెప్తే ?

అతని రెండు మాటల్లో ఏ మాటని పరిగణలోకి తీసుకోవాలి?

ఆ వ్యక్తి యెహోవా/యేసు. అతను పాత నిబంధనలో ఒక మాట, కొత్త నిబంధనలో మరో మాట చెప్పాడు.

ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిని విడిచిపెట్టకు అన్న పాత నిబంధన మాటని వదిలేయాలా?

తల్లిని వదిలేస్తే ఎన్నో రేట్లు భోగాలు అనుభవిస్తావు అని చెప్పిన కొత్త నిబంధన మాటని వదిలేయాలా?

పాత నిబంధన కొట్టి వేయబడింది కాబట్టి దాని మాటనే వదిలేద్దాం. అలాగే మన ముసలి తల్లి తండ్రులను కూడా గాలికి వదిలేద్దాం.
మనకు సుఖాలు, స్వర్గాలు ఇంపార్టెంట్. పేరెంట్స్ కాదు కదా!

ఇలా పేరెంట్స్ ని గాలికి వదిలేసిన వాళ్లకు బంపర్ ఆఫర్.

నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. (మత్తయి 19:29)

And everyone who has left houses or brothers or sisters or father or mother or children or fields for my sake will receive a hundred times as much and will inherit eternal life. (Matthew 19:29)

ఎంజాయ్..!

మీ రమన నేషనలిస్ట్

నోట్: పోస్ట్ నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. అందరితో పంచుకోండి. సేవ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *