How many people did Yehovah Kill? part -1

బైబిల్ లో ఆది నుండీ నరహంతకుడుగా ఉన్నది యెహోవా అని నేను పెట్టిన post కి రిప్లై గా కొందరు నరహంతకుడు సైతాను, యెహోవా కాదు అని సమాధానం చెప్పారు. అయితే బైబిల్ మొత్తంలో సాతాను 60 మందిని మాత్రమే చంపింది అని ఉంది. ఆ 60 మందిలో 10 మంది యోబు కుటుంబ హత్యలో యెహోవాకి కూడా వాటా ఉన్నందున సైతాను గాడి లెక్క ఇంకా తక్కువకి పడిపోయినట్టే.

అయితే యెహోవా చంపింది అక్షరాలా 2,821, 364 మందిని.

అయిన కూడా సైతానే నరహంతకుడు అంటారా?

క్రైస్తవులు ఎలాగూ ఆ హత్యలు చేసిన యెహోవానే కరుణామయుడు అనుకుంటారు కాబట్టి యెహోవా చేసిన కొన్ని హత్యలను మీ ముందు పెట్టబోతున్నాను.

యెహోవా చేసిన హత్యల సంఖ్య పెద్దది కాబట్టి part-1, part-2, part-3 అని పెడతాను. అవి చదివిన తరువాత కూడా నరహంతకుడు సైతానే యెహోవా కాదు అని అనేవాళ్ళు ఉంటే అది నాకు సంబంధం లేని విషయం.

Part-1 చిల్లర హత్యలు.

1. ఆదాము కొడుకు ఏబేలు హత్య

Non -veg ఇష్టపడే యెహోవా కి veg food అర్పణగా తెచ్చినందుకు ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరం పెట్టి యెహోవా ఏబేలు హత్యకి కారణం అవుతాడు.కానీ నేరం కయూను మీద నెట్టేస్తాడు.( ఆదికాండం 7:26)

2. Gomrah పట్టణం తగలబడుతూ ఉంటే వద్దన్నా వెనక్కి తిరిగింది అని లోతు భార్యని లేపేస్తాడు యెహోవా.( ఆదికాండం 19:26)

3. యూదా పెద్ద కొడుకు తన దృష్టిలో చెడ్డవాడు కాబట్టి చంపేశాడు యెహోవా.యూదా రెండో కొడుకు, వదినతో మరిది ధర్మం సరిగ్గా నిర్వర్తించలేదని అతన్ని కూడా చంపేశాడు. కానీ ఆ తరువాత ఆ భర్తలు చచ్చిన భార్య మామతో పడుకుని పిల్లల్ని కంటే మాత్రం ఏమీ అనలేదు.

4. అహరోను కుమారులు పొరపాటున యెహోవా వద్దని చెప్పిన దూపాన్ని అతని ముందు వెలిగించినందుకు ఆ ఇద్దరినీ చంపేశాడు.(లేవీయకాండం 10:1,10:2)

5. యెహోవా నామాన్ని దూషించాడని ఒకడిని యెహోవా చంపించాడు.(లేవీయకాండం 24:11,24:23)

6. అడవిలో కట్టెలు కొట్టేవాడిని యెహోవా చంపేశాడు. వాడు చేసిన తప్పు పరిశుద్ధ దినం రోజున పని చెయ్యడం. కానీ దీన్ని యేసు ఖండించాడు. యెహోవా నరహంతకుడు అని అనడానికి ఇదొక కారణం.( సంఖ్యా కాండం 15:32-15:35)

7. మేము కూడా అహరోను కుటుంబం లాగే యెహోవా గుళ్లో అర్చకత్వం చేస్తాము అన్నందుకు korah ఇంకా అతని కుటుంబ సభ్యుల్ని యెహోవా చంపేశాడు.(సంఖ్యా కాండం 16:25). Caste అనేది ఇక్కడి నుండే పుట్టింది.

8. దావీదుని దూషించాడని నాబాలు అనే వాడిని యెహోవా చంపేశాడు. తరువాత నాబాలు పెళ్ళాన్ని దావీదు పెళ్లాడతాడు. అంటే యెహోవా ఇక్కడ దావీదుకి ఒక పెళ్ళాన్ని పొందటంలో help చేశాడు అన్నమాట.

(1 సమోయేలు 25:39 )

9. బెత్సెబా కి దావీదుకి పుట్టిన పసి బిడ్డని యెహోవా చంపేస్తాడు. (2 సమోయేలు 12:14-18 ) అయితే ఇదే దావీదుకి బెత్సెబా పుట్టిన సలొమోనుని చంపడు.

10. దావీదు పెళ్ళికి 100 మంది మగాళ్ల penis skins ( foreskins ) అవసరం పడితే 200 మందిని చంపేందుకు సహాయం చేస్తాడు.

11.ఒక ప్రవక్తను వెక్కిరించారు అని 42 మంది పిల్లల్ని ఆడ ఎలుగు బంట్లతో కరిపించి చంపిస్తాడు.(2 వ రాజులు 2:23-24)

Last punch:

12. యెహోవా తన సొంత కొడుకు మీద కూడా కనికరం చూపలేదు. యేసుని లేపేసింది యెహోవానే.(Romans 8:32)

ఇలాంటి చిల్లర హత్యలు చేసిన నరహంతకుడు ఎవరు? సైతానా? యెహోవా నా?

ఆది నుండి అంటే ఏబేలు దగ్గర నుండి యేసు వరకు అందరినీ చంపిన నరహంతకుడు ఎవరు?

“యెహోవా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *