
tamar and scarf
బైబిల్లో ఈ కథ చదివేటప్పుడు ఒక పాత తెలుగు సామెత గుర్తుకు రావడం సహజం
“ఎర్ర చీర కట్టున్నదల్లా నా పెళ్ళామే అన్నాడట ” వెనుకటికెవడో !
ఇలాంటిదే ఈ బైబిల్ కథ
తన సొంత కోడలు ముఖానికి ముసుగు వేసుకుంటే ఆమెను కూడా వేశ్య కిందే జమ కట్టి ఆమెతో బేరమాడుకుని, సెక్స్ చేసి, ఆమెకు పారితోషికంగా కొంత ముట్టబెట్టి , మరుసటి రోజు మేకల్ని పంపిస్తాడు యూదా. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా పుడతారు క్లైమాక్స్ లో.
ఈ కథలో కొన్ని ట్విస్టులు/వింతలు ఉన్నాయి
1. ముసుగు వేసుకున్న స్త్రీని వేశ్య అని గుర్తుపట్టిన యూదా, ఆ ముసుగులో ఉన్నది తన కోడలే అని గుర్తు పట్టలేక పోవడం
2. అంతక ముందే తన కోడలితో అనేక సార్లు మాట్లాడిన యూదా ఆమె గొంతుని కూడా గుర్తు పట్టలేక పోవడం
3. శృంగారం చేసేటప్పుడు కూడా ఆమె ముఖాన్ని చూడకపోవడం
4. కోడలి ఎత్తు పొడవు మాట తీరు హావభావాలు ఏవీ మామగారికి అనుమానం కలిగించకపోవడం
5. వేశ్య అనుకొని కోడలితో శృంగారం చేసినా అతను మానసికంగా చేసింది వ్యభిచారమే అని యేసు చెప్పిన మాటని యెహోవా పరిగణలోకి తీసుకోక పోవడం
6. కోడలితో పడుకోవడం మరణ శిక్ష విధించదగ్గ నేరం అని యెహోవా చెప్పిన సంగతి యెహోవానే మర్చిపోవడం
7. మామతో శృంగారం నేరం అని యెహోవా చెప్పిన మాట యెహోవా మర్చిపోవడం
8. వేరొకడితో పడుకుంటే చంపేయాలి అని యూదా తనతోనే పడుకొని పిల్లల్ని కన్న కోడలిని నీటిఅంతురాలు అనడం
ఇలాంటి అనేక సందేహాల సమాహారం ఈ కథ
ఒక్కరంటే ఒక్కరికి కూడా యెహోవా శిక్ష వేయకపోవడం మరో ట్విస్ట్
క్రాస్ రిఫరెన్స్:
1. ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.(లేవీయకాండము 20:12).
2. జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.(సామెతలు 7:25)
3. దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.(సామెతలు 7:27)
4. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. (మత్తయి 5:27-28)
యూదా తన కోడలిని మొహపు చూపుతో చూడలేదా?
యూదా తామారు తతంగం పై పూర్తి కథ: