
virgin's son
– ఇట్లు కన్యాకుమారుడు
నవ్వకండి బాబు ఇది నిజం
గతంలో ఒక జంధ్యాల గారి సినిమాలో ఒక పాత్ర ” నేనే కాదు, మా నాన్నగారు, వాళ్ళ నాన్న గారు, వాళ్ళ నాన్న గారు అంతా బ్రహ్మ చారులమే అనే డైలాగ్ చెప్తే థియేటర్ మొత్తం పగలబడి నవ్వారు.
అలాంటి మాటే ఇది కూడా. కానీ లోకంలో అధిక జనాభా నేను పెట్టిన ఈ జోక్ ని నిజంగా నిజమని నమ్ముతున్నారు.
కాబట్టి ఇది జోక్ కాదు సీరియస్ అని చెప్పాల్సి వస్తోంది.
ఇక కథలోకి వస్తే…
ఒక కన్నెపిల్లకి నిశ్చితార్ధం అయ్యింది. ఇంకా పెళ్లి కాలేదు. రేపో మాపో పెళ్లి అనగా ఒక దేవదూత వచ్చి అమ్మా నీవు దేవుని ద్వారా తల్లి అవుతావు అనడంతో ఒక కొత్త కథ తెరమీదకి వచ్చింది. ఆమె ఇంకా కన్నెపిల్ల అంటే బహుశా కౌమార దశలోనే ఉండి ఉండాలి. ఆమె అనుమతి లేకుండా దేవుడు ఆమె జీవితంలోకి ప్రవేసింది ఆమెను కన్నెగ ఉండగానే తల్లిని చేశాడు. జోక్ ఏమిటంటే చాలా మంది దృష్టిలో ఆమె ఇప్పటికి కన్యనే .
ఇక తండ్రి సంగతి. ఈయన పేరు పవిత్ర పిశాచి. హోలీ ఘోస్ట్ అంటారు ఆంగ్లంలో. ఇందాక చెప్పుకున్న కన్నె గర్భవతి అవ్వడం అనే కాన్సెప్ట్ లో తండ్రి పాత్ర . ఈయన స్వయంగా పావురం రూపంలో వచ్చి ఆ అబ్బాయి నా కొడుకే అని చెప్పినట్టు వారి గ్రంథంలో రాసుకున్నారు. ఈయనకు కూడా పెళ్లి కాలేదు. కాబట్టి ఈయన కూడా వర్జిన్ .
ఇక కొడుకు. ఈయన గురుంచి అందరికీ తెలుసు. మచ్చలేని మగ గొర్రెగా ఈయన ప్రసిద్ధి కెక్కాడు. ఒక వేశ్యతో ఈయను సక్రమ సంబంధం ఉంది అని ఆనోటా ఈనోటా వినిపిస్తున్నా అలాంటి విషయాలు ఏవీ ఆ గ్రంథంలో ఇప్పుడు లేవు కాబట్టి ఈయన కూడా వర్జిన్ యే.
ఇలా ఒక కుటుంబం మొత్తం వర్జిన్స్ అవ్వడం బహుశా ఇంతక ముందెన్నడూ జరగలేదు. ఇక ముందు ముందు జరగదు. ఇది నభూతో న భవిష్యతీహి..!