
దేవుని దృష్టిలో బానిసల ప్రాణాలకి విలువ తక్కువా?
మా దేవుడు అందరినీ అందరినీ సమానంగా చూశాడు అనే క్రైస్తవుల వాదనలో నిజమెంత?
సమానత్వం అంటే ఒక మనిషిని ఒకలాగా బానిసని ఒకలాగా చూడటమా?
బానిస ప్రాణం ఖరీదు 30 తులముల వెండితో సమానమా ?
అదే సాధారణ మనిషిని ఎద్దు పొడిస్తే ? ఒకే సంఘటనకు మనుషులని బట్టి వేరు వేరు తీర్పులు చెప్పే బైబిల్ దేవుడి నీతికి ఈ ఆజ్ఞ మంచి ఉదాహరణ.
Rule -1
(మొదటి సారి ఎద్దు పొడిస్తే యజమాని నిర్దోషి)
ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.(నిర్గమకాండము 21:28)
Rule -2
ఎద్దు మనుషులను పొడిచే గుణం కలిగినది అని యజమానికి తెలిసిన తర్వాత కూడా ఎద్దు ఒకడి కూతురినే/కొడుకునో పొడిస్తే మరణ శిక్ష / 30 తులముల వెండి నష్ట పరిహారం
ఒకడి ఎద్దు వేరొకడి కూతురినో / కొడుకునో పొడిస్తే ఎద్దు యొక్క యజమానికి మరణశిక్ష వేయాలి/అతను నష్టపరిహారం చెల్లించాలి
ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను;
దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను. (నిర్గమకాండం 21:29)
వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.(నిర్గమకాండం 21:30)
అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.( నిర్గమకాండం 21:31)
Rule -3
ఎద్దు మనుషులను పొడిచే గుణం కలిగినది అని యజమానికి తెలిసిన తర్వాత కూడా ఎద్దు బానిసని/దాసుడినిపొడిస్తే కేవలం 30 తులముల వెండి నష్ట పరిహారం
ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను. (నిర్గమకాండము 21:32)
చూశారుగా ఒక సాధారణ మనిషి యొక్క కూతురుని ఎద్దు పొడిసిన సందర్భంలో మరణ శిక్ష లేదా నష్టపరిహారం అని చెప్పిన యెహోవా , అదే ఎద్దు ఎద్దు ఒక బానిసని పొడిసిన సందర్భానికి వచ్చేసరికి మరణ శిక్ష అనే ఆప్షన్ మొత్తం లేపేశాడు బైబిల్ దేవుడు!
ఇప్పుడు కొందరు దాసి అంటే బానిస కాదు పనివాళ్ళు అని వాదనకు దిగుతారు.. అలానే అనుకున్నా కూడా పనివాళ్లను ఎద్దు పొడిస్తే కేవలం నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా? మరణ శిక్ష అవసరం లేదా?
ఒక బానిసని ఎద్దు పొడిస్తే శిక్ష ఎద్దు యొక్క యజమానికి ఎందుకు తగ్గింది?
పోయిన బానిస ప్రాణాలు ఒక సాధారణ మనిషి కొడుకు /కూతురు ప్రాణాల కంటే తక్కువ విలువైనవా?
బానిసని పొడిస్తే ఎద్దు యజమానికి మరణ శిక్ష వేయాల్సిన అవసరం లేదా?
ఇంకో చోట బైబిల్ దేవుడు చెప్పిన మాట చూడండి.
బానిసల్ని చచ్చేటట్లు కొట్టినా తప్పు లేదు. ఎందుకు అంటే బానిసలు యజమాని సొమ్మే కాదా అంటాడు యెహోవా.
“ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును.”
“అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.”
(నిర్గమ కాండం 21:20-21)
కాబట్టి బైబిల్ దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, కరుణామయుడు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే.
ఒకే సంఘటనలో రెండు వేరు వేరు తీర్పులు ఉండటం సమానత్వం కాదు.. వివక్ష ..!