హీరోలని కుళ్లబొడిస్తేనే క్షైమాక్స్ సూపర్ హిట్ అని నమ్మిన దర్శక, రచయిత
యెహోవా *యేసు ఒకప్పుడు బైబిల్ రచయితలు కూడా ఇదే ఫార్ములా వాడారు మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. (యెషయా 53:5) యేసుని కుళ్లబొడవడం వల్లనే పాపాలు పోయాయి అనడం కూడా ఇలాంటిదే! ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. (పేతురు 2:24)
ఫార్ములాకి బైబిల్ రచయితలే ఇన్స్పిరేషనా ?
కొంత వరకూ అవకాశం కనిపిస్తోంది.
హీరో పాత్రని మొదట్లో అమాయకుడిలాగా చూపించి, జనాలకి అతని పైన ప్రేమ కలిగేలా చేసి చివరికి అతన్ని విల్లన్ చేతిలో గట్టిన తన్నించడం తేజ ప్రత్యేకత. త్వరలో రాబోతున్న “అహింస” అనే చిత్రంలో కూడా ఇదే ఫార్ములా వడబోతున్నాడు డైరెక్టర్ తేజ..
అయితే ఇలాంటి tricks ప్లే చేసి సక్సెస్ అయిన రచయితల్లో ముందు వరుసలో ఉంటారు బైబిల్ రచయితలు. మొదట్లో యేసుని అమాయకుడిగా చూపించి, ఆఖరిలో కొరడాలతో కొట్టించి, మూళ్ళ కిరీటం పెట్టించి ముఖం పైన ఉమ్ము వేయించి, బట్టలు ఊడబీకించి, సిలువ మోయించి, మేకులు కొట్టించి, బల్లెం తో పొడిపించి , ఈడ్చి ఈడ్చి లాక్కెళ్లినట్టు బైబిల్లో రాసుకున్నారు.
దాన్ని సినిమా వాళ్ళు మరింత కరుణ రసం పండేలా చిత్రీకరించి యెహోవా పై సింపతీ వచ్చేలా చేసారు. ఐతే ఈ సక్సెస్ ఫార్ములాలో హీరో ని ఎప్పుడూ విలన్ వర్గం చితకబాదేస్తూ ఉంటే ఆడియన్స్ ఏడుస్తూ ఎంజాయ్ చేయడం కామన్. హీరో ఎన్ని దెబ్బలు తింటే సినిమా కి అంట ప్లస్ అవుతుంది.
ఐతే బైబిల్ లో సేమ్ థియరీ అప్లై చేశారు. కాకపోతే యేసు ఎన్ని దెబ్బలు అన్ని పాపాలు పోతాయి అని రాసుకున్నారు. ఎంత ఘోరంగా ఛస్తే అంత పాపపరిహారం అన్న మాట !
ఈ రెఫరెన్సెస్ చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను.
ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. (1 పేతురు 2:24)ఇక్కడ ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత పొందారు అంటున్నాడు బైబిల్ రచయిత. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. (యెషయా 53:5)
ఇక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును అంటున్నారు. బాగుంది. ఐతే యేసుకి తగిలిన దెబ్బల వలనే పాప క్షమాపణ వచ్చింది అనుకుందాం. యేసు అలా దెబ్బలు తినడానికి కారణం ఎవరు ? ఈ కథలో విల్లన్ ఎవరు ?
యేసుకి సిలువ వేసిన రోమన్ల ? యేసుని చంపాలని చూసిన యూదులా ?కాదు. అక్కడే ట్విస్ట్ ఉంది. యేసు ఇలా దెబ్బలు తిని, చితక్కొట్టబడి చనిపోవాలి అని ప్లాన్ వేసింది యెహోవా. అవును యేసు తండ్రి యెహోవానే !!! ఈ రెఫరెన్సెస్ చూడండి.
1. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రతనుండి రక్షింప బడుదుము.(రోమీయులకు 5:9)Since we have now been justified by his blood, how much more shall we be saved from God-s wrath through him! (Romans 5:9).”
యెహోవా గారి కోపం నుండి జనం తప్పించుకోవాలి” అనే కారణం చేత యేసు చనిపోవాల్సి వచ్చింది. అని అర్థం
2. క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.( రోమీయులకి 3:25).
God presented him as a sacrifice of atonement, through faith in his blood. He did this to demonstrate his justice, because in his forbearance he had left the sins committed beforehand unpunished–(Romans 3:25).అంటే పాపాలను తొలగించే బలి పశువు ( గొర్రె ) గా యేసుని చంపి అందరి పాపాలను యెహోవా తొలగుంచాడు.
3. తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు? (రోమీయులకు 8:32)He who did not spare his own Son, but gave him up for us all–how will he not also, along with him, graciously give us all things? (Romans 8:32)అంటే తన సొంత కొడుకునే చంపడానికి కూడా వెనకాడని యెహోవా మన కోసం ఏమైనా చేస్తాడు అని అర్థం.కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే ఒక తండ్రి తన కొడుకుని బలి ఇచ్చిన రోజే తప్ప ఇందులో గొప్ప విషయం కాని, శుభకరమైన విషయం కాని లేదు.
పై వాక్యాల ప్రకారం యెహోవానే యేసుని బలి తీసుకున్నాడు అని నిర్ధారణ అవుతోంది కదా.తాను సృష్టించిన మనుషుల యొక్క పాపాలను తొలగించడానికి ఒక మనిషిని అది కూడా తన కొడుకు అని చెప్పుకుంటున్న వాడిని హింసలకు గురి చేసి చంపడడం అంత తెలివైన పని అనిపించుకోదు.
ఏదేమైనా హీరో పాత్రని చిటాక్కొట్టక పోతే క్లైమాక్స్ హిట్ అవదు అన్న సినిమా / నవలా రచయితల లాజిక్ ఇక్కడి నుండే పుట్టి ఉంటుంది అనడంలో సందేహం లేదు.
మొన్న RRR లో కూడా ఒక హీరో పాత్ర ఇంకో హీరో పాత్రని చితక్కొట్టుడుతూ ఉంటే జనం ఫుల్ సింపతీ చూపించి సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు.
ఇలాంటి విషయాలు రచయితలకి బాగా తెలుసు కావాలంటే తేజ, రాజమౌళి సినిమాలని గమనించండి. లేదా బైబిల్ చదవండి. హ్యాపీ గుడ్ ఫ్రైడే ఫ్రెండ్స్