Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

భూమిని వణికించే 3 విషయాలు, భూమి భరించలేని 4వ విషయం

” దాసి తన యజమానురాలికి హక్కుదారురాలు అయితే భూమి భరించలేదు”

బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక వచనం/ ఒక కొటేషన్ ఉంది అంటే దానికి లంకె మరో చోట ఖచ్చితంగా ఉందన్న మాటే.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే వచనం కూడా అలాంటిదే.

వచనం:

భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు. అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి. (సామెతలు 30:21-23)

Under three things the earth trembles, under four it cannot bear up: Servant who becomes king, A fool who is full of food, an unloved woman who is married, and A slave who displaces her mistress.(Proverbs 30:21-23)

తెలుగు అనువాదకులు సరిగ్గా అనువాదం చేయకపోవడం వలన కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది ఈ వచనల్లో.. ఇలా అనువాదం చేసి చూడండి.

“Under three things the earth trembles, under four it cannot bear up:

భూమిని వణికించేవి 3 విషయాలు కలవు. నాలుగవ విషయం భూమిని భరించలేనిది కలదు.

ఈ వచనాలకు అర్ధం ఏమిటి?

పై వచనాలు కేవలం సరదాగా రాసుకున్నవి కాదు. బైబిల్లో ఈ వచనాన్ని బైబిల్ దేవుడు ఎక్కడ అప్లై చేశాడో తెలియాలంటే మీకు అబ్రాహాము – హగర్ కథ తెలియాల్సిందే.

ఎవరు ఈ హాగరు ?

అబ్రాహాము రెండో భార్య హగర్ (బానిస స్త్రీ )

ఆమె ఒక బానిస. ఆమెను శారాయి (అబ్రాహాము మొదటి భార్య) తెచ్చుకుంటుంది.

అబ్రాహాముకి శారాయి వలన సంతానం ఉండదు. అప్పటికే అబ్రాహాముకి వయసు 100 ఏళ్ళు దగ్గర పడుతున్నా తనకు పిల్లలు లేరు కాబట్టి హగర్ ని అబ్రాహాము దగ్గరకి పంపిస్తుంది శారాయి. (అంటే పెళ్లి చేసింది అన్నమాట).

అనుకున్నట్టుగానే హగర్ కి కడుపు వస్తుంది. అప్పటి నుండి ఇంట్లో గొడవలు. Inferiority complex కి గురి అయిన శారాయి, అబ్రాహాము సహాయంతో హగర్ ని TORTURE పెడుతుంది. కడుపుతో ఉన్న హగర్ ఇంట్లో నుండి పారిపోతుంది.


అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా.. (ఆదికాండము 16:6)

యెహోవా దూత హగర్ ను ఓదార్చి, నీ యజమానురాలి దగ్గర అణిగిమణిగి ఉండమని చెప్పి ఇంటికి చేరుస్తుంది.

శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను. (ఆదికాండము 16:8)
అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పెను. (ఆదికాండము 16:9)

హగర్ కి ఇస్మాయిల్ అనే కొడుకు పుడతాడు. తర్వాత శారాయి కి అనుగ్రహం వలన కొడుకు పుడతాడు. వాడి పేరు ఇస్సాకు.

హగర్ కొడుకు అబ్రాహాముకి వారసుడు కావడం శారాయికి ఇష్టం ఉండదు. దాంతో అబ్రాహాము చెప్తుంది. పంపించేయండి దాన్ని ఇంట్లో నుండి అని.. ఈ విషయం యెహోవా కి చెప్తాడు అబ్రాహాము. అప్పుడు యెహోవా అంటాడు “నీ పెళ్ళాం చెప్పిన ప్రతి మాట విను. ఆమె చెప్పినట్టే చెయ్యమని”

ఈ రిఫరెన్స్ చూడండి

అయితే దేవుడు.. “ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.” (ఆదికాండము 21:12)

“కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను”. (ఆదికాండము 21:14)

తర్వాత ఆమె నరకం చూస్తుంది.

పిల్లాడికి నీళ్లు కూడా ఎండలో ఇబ్బంది పడుతుంది.

ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. (ఆదికాండము 21:15-16)

అప్పుడు యెహోవాకి మనసు కరుగుతుంది. దేవదూతని పంపించి ఓదార్చుతాడు. నీ బిడ్డ కూడా అబ్రాహాము సంతానమే అంటాడు. కానీ వారసత్వం మాత్రం ఇస్సాకుకే చెందుతుంది.

దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.(ఆదికాండము 21:20).

…..

ఈ కథలో అబ్రాహాము కొడుకు ఇస్సాకు అబ్రాహాముకి వారసుడు అవుతాడు. ఇస్మాయిల్ ( హగర్ కొడుకు ) అడవుల్లో పెరుగుతాడు. కారణం ఏమిటి?

హగర్ ఒక బానిస స్త్రీ కావడమే.

బానిస స్త్రీ అయిన హగర్ కొడుకు, అబ్రాహాముకి వారసుడు కాకుండా, యెహోవా ఎందుకు చేశాడు?

భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు.అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి. (సామెతలు 30:21)

చూశారుగా ఈ వాక్యాలు.!

రాజారికమునకు వచ్చిన దాసుడు ( ఇస్మాయిల్ )
యజమానురాలికి హక్కు దారురాలైన దాసి ( హగర్ )
యెహోవా కి ఇష్టం లేదు. వాళ్ళ వలన భూమి తట్టుకోలేక వణుకుతుంది.

అందుకే యెహోవా శారాయు కొడుకు అయిన ఇస్సాకు కే వారసత్వం కట్టబెట్టాడు. బానిస కొడుకు అడవుల్లో బతికేలా చేశాడు.

…..

హగర్ కి ఎందుకు ఇంత అన్యాయం చేశాడు బైబిల్ దేవుడు?

ముసలి అబ్రాహాము దగ్గరకి పోయి పిల్లల్ని కనడం ఆమె తప్పా?
అబ్రాహాముకి మొదటి కొడుకుని ( నిజానికి అతనే వారసుడు ) ఇవ్వడం తప్పా?
కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసిన అబ్రాహాముని పన్నెత్తి మాట అనలేదు యెహోవా ఎందుకు? కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసిన అబ్రాహాము కి యే శిక్ష పడింది.

ఇప్పుడు చెప్పండి..

బానిస కి ఒక లాగా, మామూలు స్త్రీలకి ఒక లాగా తీర్పు చెప్పే వాడు దేవుడు ఎలా అవుతాడు.
బానిస కొడుకు వారసుడు కాకూడదా?
దాసి అయినంత మాత్రాన తన మొగుడు దగ్గర ఉండే అర్హత బానిస కోల్పోతుందా?
కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అబ్రాహాము వదిలేసినప్పుడు యెహోవా అబ్రాహాముని ఎందుకు శిక్షించలేదు.
ఫైనల్ గా ఈ కథలో అన్యాయం అయిపోయింది మాత్రం హగర్ అనే బానిస స్త్రీ.. ఆమె కొడుకు ఇస్మాయిల్.

దానికి కారణం యెహోవా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *