
మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు?
- పొలం దున్నే పనివాడిగా
- తనలాగే బతకడానికి
- తన చేతిలో చావడానికి
- తన ఆనందం కోసం
ఈ 5 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ నిజమయ్యే అవకాశం ఐతే ఖచ్చితంగా ఉంది. మరి అసలు సమాధానం ఏమిటి? బైబిల్ నుండి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
రిఫరెన్స్ -1
దేవుడు తన ఆనందం కోసం ఈ సృష్టి అంతా చేసుకున్నాడు.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయన #ద్వారాను ఆయనను #బట్టియు సృజింపబడెను. (కొలొస్సయులకు 1:16)
For in him were created all things in heaven and on earth, the visible and the invisible, whether thrones or dominions or principalities or powers; all things were created through him and for him. (Colossians 1:16)
రిఫరెన్స్ -2
యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.(సామెతలు 16:4)
The LORD hath made all things for Himself/his purpose, yea, even the wicked for the day of evil. (Proverbs 16:4)
ఇలాంటి అనేక వచనాలు ఈ సృష్టి అంతా యెహోవా తన కోసమే చేసుకున్నాడు అని చెప్తున్నాయి. అలాగే ఆయన పుట్టించిన (సృష్టించిన ప్రతి వస్తువు/ ప్రాణికి ఒక పని కల్పించాడు. అవి వాటి పుట్టుక ఎందుకో తెలుసుకొని మసలుకోవాలి.
మనిషిని ఎందుకు పుట్టించాడు?
మనిషి (ముఖ్యంగా మగవాడిని ) పొలంలో పనిచేయడానికి పుట్టించాడు
అదివరకు పొలమందలియే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటుకు నరుడు లేడు. (ఆదికాండము 2:5)
and no shrub of the field had yet appeared on the earth and no plant of the field had yet sprung up, for the LORD God had not sent rain on the earth and there was no man to work the ground. (Genesis 2:5)
ఇక్కడ మనిషి ఇంకా పుట్టలేదు కాబట్టి పొలంలో ఏ మొక్కా మొలవలేదు అంటున్నాడు యెహోవా. అంటే మనిషి యొక్క అవసరం పొలంలోనే అని అర్ధం అవుతోంది. మనిషిని పొలాలు దున్నటానికే దేవుడు పుట్టించాడు అని అనుకోవాల్సి వస్తుంది.
స్త్రీని ఎందుకు పుట్టించాడు ?
మగాడి కోసం.
మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు. (1 కోరింథీయులకు 11:9)
Neither was man created for woman, but woman for man. (1 Corinthians 11:9)
ఆమె వలన ఉపయోగం ఏమిటి?
అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. (ఆదికాండము 2:20)
So the man gave names to all the livestock, the birds of the air and all the beasts of the field. But for Adam no suitable helper was found.(Genesis 2:20)
ఇలా ప్రతి వస్తువుని/ప్రాణినీ ఒక అవసరం తో యెహోవా పుట్టించాడు ?
ఇంకా …
తన భజన కోసం :
నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు. (యెషయా 43:21)
This people have I formed for myself; they shall shew forth my praise. (Isaiah 43:21)
మరి సైతాను ని ఎందుకు పుట్టించాడు?
మానవాళిని పాపం చేసేలా చెయ్యడానికి. (రిఫరెన్స్ అవసరం అంటారా ?)
యేసుని ఎందుకు పుట్టించాడు ? సైతాను వలన వచ్చిన పాపాలను కడగటానికి. (రిఫరెన్స్ అవసరం లేదు. అందరూ చెప్పుకునేదే )
ఇంతే.. సింపుల్ ఫార్ములా కదా !
ఐతే హవ్వ ఆదాముని, బాగా విస్తరించి భూమి అంతటినీ ఏలుకోమని చెప్పాడు అని ఒక చోట రాసి ఉంది. మరి దాని సంగతి ?
దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (ఆదికాండము 1:28)
God blessed them and said to them, “Be fruitful and increase in number; fill the earth and subdue it. Rule over the fish of the sea and the birds of the air and over every living creature that moves on the ground.” (Genesis 1:28)
ఎందుకు ? భూమంతా విస్తరించి భూమిని లోబరుచుకుని ఏం చెయ్యాలి?
జలప్రళయంలో యెహోవా చేతిలో చంపబడటానికా? అంతే అంతే ..!
అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.(ఆదికాండము 7:21)
పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. (ఆదికాండము 7:22)
తన ఇష్టానికి పుట్టించుకుని, తన ఇష్టానికే చంపుకునే దేవుడిని మళ్ళీ కరుణామయుడు, దయామయుడు అని పొగుడుతూ పాటలు పాటలు పాడాలా ?
పాపం చేయించడానికి ఒకరిని, పాపం కడిగేయడానికి ఒకరిని, పొలంలో పనిచేయడానికి ఒకరిని. పిల్లలని కనడానికి ఒకరిని.. చంపడానికి ఒకరిని, నీ చేతిలో చావడానికి ఒకరిని ఇలా మనుషులని పుట్టించుకున్నావా యెహోవా?
అంటే అందరినీ ఆటలో అరటి పండుని చేశావన్న మాట ..!