Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

sun in the bible science

sun in the bible science

బైబిల్ విజ్ఞానం (సూర్యుడి గురుంచి 10 వాక్యాలు)

  1. సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. (ప్రసంగి 1:5)

The sun rises and the sun sets and hurries back to where it rises. (Ecclesiastes 1:5)

  1. దేవుడు మొదటి రోజున భూమిని, నాల్గవ రోజున సూర్యుడిని సృష్టించాడు

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. (ఆదికాండము 1:1)

దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.(ఆదికాండము 1:16)

దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. (ఆదికాండము 1:19)

In the beginning, God created the heavens and the earth. (Genesis 1:1)

God made two great lights–the greater light to govern the day and the lesser light to govern the night. He also made the stars
(Genesis 1:16)
And there was evening, and there was morning–the fourth day. (Genesis 1:19)

  1. సూర్యుడి ఉపయోగం = క్యాలెండరు /గడియారం

దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. (ఆదికాండము 1:14-15)

And God said, “Let there be lights in the expanse of the sky to separate the day from the night, and let them serve as signs to mark seasons and days and years, and let them be lights in the expanse of the sky to give light on the earth.” And it was so. (Genesis 1:14-15)

  1. సూర్యుడిని ఆపవచ్చు. అస్తమించకుండా చేయవచ్చు.

సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. (యెహోషువ 10:13)

  1. సూర్యుడు ఎక్కడ ఉంటాడు ?

వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.(కీర్తనల గ్రంథము 19:4)

గుడారం అంటే Tent అయితే అది ఎక్కడుందో నాకు ఐతే తెలియదు. బహుశా ఆకాశంలో వేసి ఉంటాడు.

  1. సూర్యుడిని మధ్యాహ్నం కూడా అస్తమింప జేయగలడు యెహోవా.

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.(ఆమోసు 8:9)

  1. సూర్యుడు పాటలు పాడతాడు . చంద్రుడు కూడా పాటలు పాడతాడు

సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.(కీర్తనల గ్రంథము 148:3).

నోరులేని సూర్య చంద్ర నక్షత్రాలు యెహోవా గురించి చర్చిలో పడినట్టు ఎలా పాటలు పాటి స్తుతిస్తారో, అసలు వాటికి బ్రెయిన్ ఉందా? పోనీ ఇలా రాసిన వాడికి అయినా ఉందా?

  1. నక్షత్రాలు భూమిపైన రాలతాయి . సూర్యుడు ఒక చిన్న నక్షత్రం కానీ సూర్యుడు రాలడు. మరి గ్రావిటీ ???

పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను. (ప్రకటన గ్రంథం 6:13)

  1. నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు. వీలయితే వాటన్నిటికీ పేర్లు కూడా పెట్టవచ్చును.

నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. (కీర్తనల గ్రంథము 147:4 )

  1. యెహోవా చెప్తే సూర్యుడు చంద్రుడు తమ డ్యూటీ మానేస్తారు

ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును.(యోబు 9:7)

కాబట్టి సైన్స్ పాఠాలకు బదులుగా బైబిల్ విజ్ఞానం స్కూల్స్ లో బోధించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *