KOSHER VS NON KOSHER FOOD

KOSHER VS NON KOSHER FOOD

ఒకరోజు అన్నీ తినొచ్చు అంటాడు. మరో రోజు అపరిశుద్ధం తినొద్దు, నేను పరిశుద్దుడిని కదా అంటాడు. ఇంకో రోజు అన్నీ OK అంటాడు.

ఇంతకీ చచ్చిన జంతు మాంసం ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలు వారికా? విదేశీయులకా?

బైబిల్ దేవుడు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ లో ఉంటాడు?

పూర్తి వివరాలు ఒక్క పోస్టులో..

బైబిల్ దేవుడు పెట్టిన ఆహార నియమాలు, ఆదాము నుండి యేసు వరకూ

  1. దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును భూమిపైన కదిలే ప్రతి ప్రాణినీ తినవచ్చును. (ఆదికాండము 1:29)

Then God said, “I give you every seed-bearing plant on the face of the whole earth and every tree that has fruit with seed in it. They will be yours for food. (Genesis 1:29)

గమనిక: అది హవ్వ ఆదాముల కాలం. అప్పటికి ఇంకా యెహోవాకు తాను పరిశుద్ధుడను కాబట్టి అందరూ పరిశుద్ధంగా ఉండాలి అనే స్పృహ ఉన్నట్టు లేదు. “భూమిపైన కదిలే ప్రతి ప్రాణినీ తినవచ్చును” అనే మాట చెప్పాడు.

  1. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
    అయినను మాంస మును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. (ఆదికాండము 9:3-4)

Everything that lives and moves will be food for you. Just as I gave you the green plants, I now give you everything. “But you must not eat meat that has its lifeblood still in it.(Genesis 9:3-4)

గమనిక: ఇది నోవహు కాలంలో యెహోవా పెట్టిన నియమం. ఈ ఆజ్ఞ ప్రకారం పాములు, కప్పలు, పందులు, పురుగులు, కీటకాలు మనుషులు తినవచ్చును. ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రక్తం మాత్రం తినకూడదు. ఎందుకు అంటే రక్తమే దాని ప్రాణం.

అప్పటికే పాపాలు చేస్తున్నారని ప్రపంచంలోని అందరినీ చంపేశాడు. (10 మందిని తప్ప). అప్పటికి ఇంకా నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధమైన ఆహారం తినండి అనే ఆఙ్ఞ యెహోవా ఇవ్వలేదు. జనం అపరిశుద్ధంగా జీవించాలని యెహోవా భావించి ఉండవచ్చు.

3.ఇక మోసే కాలం వచ్చింది. యెహోవా కొత్త నియమాలతో వచ్చాడు. తాను పరిశుద్ధుడిని కాబట్టి ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పుకొచ్చాడు.

నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. (లేవీయకాండము 11:44)

పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.
వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు. (లేవీయకాండము 11: 6, 7)

ఇంతక ముందు నేల మీద ప్రాకే జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు అని సెలవిచ్చాడు. అలాగే నేల మీద చరించే పంది లాంటి జీవులను కూడా తినొద్దు అన్నాడు. ముడతలను తినొచ్చు అన్నాడు. గబ్బిలం తినొద్దు అన్నాడు. ఇలా ఒక్కో జంతువుకి ఒక్కో నియమం పెట్టాడు .

కారణం: తాను పరిశుద్ధుడిని కాబట్టి, తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని.

  1. పరిశుద్ధమైన ఆహారం తన వారికి, చచ్చినవి పరులకు అనే వాదనతో వచ్చాడు యెహోవా

మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను.(నిర్గమకాండము 22:31)

Give dead meat to dogs :

“You are to be my holy people. So do not eat the meat of an animal torn by wild beasts; throw it to the dogs. (Exodus 22:31)

చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. (ద్వితీయోపదేశకాండము 14:21)

Give dead meat to foreigners :

Do not eat anything you find already dead. You may give it to an alien living in any of your towns, and he may eat it, or you may sell it to a foreigner. But you are a people holy to the LORD your God. Do not cook a young goat in its mother’s milk. (Deuteronomy 14:21)

  1. యేసుకాలం వచ్చింది. ఏది తిన్నా పర్వాలేదు అనే వాదన మొదలైంది.

యేసు అన్నిటినీ తినొచ్చు అన్నాడు అంటూ క్రైస్తవులు ప్రచారం మొదలు పెట్టారు.

యెహోవా చెప్పిన పరిశుద్ధ ఆహారాలు, తినొద్దు అన్న అపరిశుద్ద ఆహారాలు అన్నీ ఇప్పుడు ఒక అన్నారు. అడిగితే యేసు మాకు కలలో కనపడి చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు .

అపరిశుద్ద ఆహారాలు ఇకపై పరిశుద్ధం అని పేతురు /సీమోను తో కలలో చెప్పిన యేసు

ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను. (అపో. కార్యములు 10:11-12)

It contained all kinds of four-footed animals, as well as reptiles of the earth and birds of the air.(Acts 10:12)

అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.(అపో. కార్యములు 10:13)

అయితే పేతురువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్ర మైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. (అపో. కార్యములు 10:14-15)

The voice spoke to him a second time, “Do not call anything impure that God has made clean.(Acts 10:15)

ఇక మొదలైంది నా సామీ రంగా మార్కెట్ లో దొరికే వాటిలో దేన్నీ వదలకుండా తినేయొచ్చు. దేవుడే తినమ్మన్నాడు అంటూ యేసు బ్యాచ్ రెచ్చిపోయింది.

మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. (1 కోరింథీయులకు 10:25,26)

దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు. (1 తిమోతికి 4:4)

తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. (రోమీయులకు 14:3)

ఇవన్నీ చూసి యూదులకు మంట పుట్టిందో, మెంటలే వచ్చిందో యేసు అండ్ బ్యాచ్ ఒక్కొక్కరిని లేపేశారు.

ఇప్పుడు చెప్పండి అన్నీ తినొచ్చా? పరిశుద్దమైన వాటినే తినొచ్చా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *