
did Abraham lie about Sara is sister?

శారా అనే చెల్లిని అబ్రాహాము పెళ్లి చేసుకున్నాడా? లేదా?
అబ్రాహాము అబద్ధం చెప్పాడా? లేక నిజమే చెప్పాడా?
క్రైస్తవుల వాదన vs బైబిల్ నిజాలు
context:
అబ్రాహాము తన భార్య అయిన శారాతో మన మిద్దరం అన్నా చెల్లెల్లం అని అందరికి చెప్పమని చెప్తాడు. ఆ మాట నిజమే అనుకొని ఒక రాజు గారు అబ్రాహాము భార్య అయిన శారాను తనతో తీసుకుపోతాడు. తర్వాత దేవుడు రాజుగారి కలలో కనపడి అరేయ్ బాబు అది వాడి పెళ్ళాం రా అంటాడు. అదేమిటి ? నాతో చెల్లెలు అని చెప్పాడే అంటే దేవుడు ఆ విషయం గురుంచి మాట్లాడకుండా ముందు వాడి పెళ్ళాన్ని వాడికి అప్పగించు లేదా నీ పెళ్ళాలకు పిల్లలు పుట్టకుండా చేస్తా అంటాడు. దాంతో రాజు గారు అబ్రాహాముకి శారాను అప్పగించి, ఆమెకు సారె చీర పెట్టి పంపిస్తాడు. కొంత మంది పనివాళ్లను (బానిసలను) కూడా ఇస్తాడు. ఇచ్చేటప్పుడు ఒక మాట అంటాడు.
“మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయ మంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.(ఆదికాండము 20:16)”
రాజు గారు శారాతో చెప్పిన మాటను గమనించండి. దేవుడితో మాట్లాడిన తర్వాత కూడా రాజు గారు శారా అబ్రాహాముకి చెల్లెలే అనే నమ్మకంతో మాట్లాడుతున్నాడు. ఆమెకూడా ఆ విషయాన్ని ఖండించలేదు. ఇదంతా దేవుడు రాజుగారికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత జరిగింది.
రాజుగారు ఇలా ఎందుకు మాట్లాడాడు?
మొదటి కారణం:
రాజుగారు అబ్రాహాముతో “ఏమయ్యా ఆమె నీ చెల్లెలు అన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? అన్నప్పుడు అబ్రాహాము ఏం చెప్పాడో చూడండి.
అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.
అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.(ఆదికాండము 20:11-12)
ఇది జరిగే సమయానికి దేవుడు రాజు గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అబ్రాహాము రాజు గారికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ధైర్యంగా నిజం ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు. గతంలో దేవుడికి మీరు భయపడరు అనుకొని నా భార్య గురుంచి మీకు అబద్ధం చెప్పాను. నిజానికి ఆమె నా చెల్లెలే. కాకపోతే ఆమె నా తండ్రి కూతురు. మా అమ్మకు పుట్టింది కాదు. అని.
“దేవుడికి భయపడని స్థలం కాబట్టి అబద్ధం చెప్పాను. నిజానికి నా భార్య నా చెల్లెలే కానీ ఆమె మా అమ్మ కూతురు కాదు. మా నాన్న కూతురు “
ఈ కథ ద్వారా మనకు తెలిసిన విషయాలు:
- భయపడి పెళ్ళాన్ని చెల్లెలు అని ప్రచారం చేసుకున్నాడు అబ్రాహాము. అంటే అతను అంత ధైర్యవంతుడు కాదు.
- దేవుడు తన వెనుక ఉన్నాడు, రాజు గారు తన భార్యని తిరిగి ఇచ్చేస్తున్నాడు అని తెలిశాక కూడా శారా నాకు చెల్లెలే అని నిజం చెప్పాడు.
- దేవుడు తనతో మాట్లాడిన తర్వాత కూడా రాజు గారు శారాతో మీ అన్న అబ్రాహాముకి వెయ్యిరూపాయలు ఇచ్చాను అన్నాడు. శారాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం రాజుకి లేదు. రాజు ఇప్పటికీ ఆమె అబ్రాహాముకి చెల్లెలే అని నమ్ముతున్నాడు. అది కూడా అబ్రాహాము మరియు యెహోవాతో ఈ విషయంపై చర్చించిన తర్వాత కూడా.
- ఇక్కడ స్థలానికి భయపడి భార్యని చెల్లెలు అనడం తో పాటు, తన భార్యే తన తండ్రికి పుట్టిన చెల్లెలు కూడా అన్న విషయాన్నీ అబ్రాహాము ఒప్పుకున్నాడు. అది కూడా దేవుడు తన వెనుక ఉన్నాడని తెలిశాక.
ఇక మీరు ఇవ్వబోయే సమాధానాలు
టైపు -1
అన్నా-చెల్లెళ్లు పెళ్లి చేసుకుంటే తప్పేమిటి?
అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు.
టైపు -2
అబ్రాహాము అబద్ధం చెప్పాడు.
టైపు -3
అబ్రాహాము తండ్రికి కూతుళ్లు లేరు.కొడుకులే ఉన్నారు.
మొదటి రెండు సమాధానాలకు అంత విలువ లేదు. ఎందుకు అంటే వాటివలన కథలో మార్పు ఏమి రాదు. ఐతే మూడో సమాధానం కి కొంచెం వెయిట్ ఉంది. దాని సంగతి చూద్దాం.
ఇశ్రాయేలులో ఎవడికో పుట్టిన వాళ్ళని కూడా తమకే పుట్టినట్టు చెప్పుకునే ఆచారం ఉంది. భర్త చనిపోయాక భార్య వేరొకడితో పిల్లలని కంటే చనిపోయిన భర్త ఖాతాలో వేసే అవకాశం ఉంది.
అలా అబ్రాహాము తండ్రి ఖాతాలో శారా చేరి ఉండవచ్చు. ఆ తల్లికే అబ్రాహాము పుట్టి ఉండవచ్చు. తెరహు అబ్రాహాముని కన్న తండ్రి, కానీ శారా కి పెంపుడు తండ్రి అవ్వవచ్చు. అలా చూసినా శారా అబ్రాహాముకి ఒకే తల్లికి పుట్టిన చెల్లెలు. అంటే వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టినట్టు. కానీ వీటిపై ఆధారాలకి బైబిల్ లో స్తానం కల్పించలేదు. ఎందుకు అంటే స్త్రీల పుట్టుక గురుంచి నోట్ చేయాల్సినంత అవసరం లేదేమో వాళ్ళకి.
స్త్రీల పుట్టుకపై బైబిల్ రచయితలు అంతగా ద్రుష్టి పెట్టరు. ఇది మనము బైబిల్ అంతటా చూస్తాము. ఉదాహరణకు మేరీ తల్లి తండ్రులు ఎవరో బైబిల్లో క్లారిటీ లేదు. హవ్వ కూతుర్లు ఎవరో క్లారిటీ. యేసు వంశావళిలో ఆడవాళ్ళ ప్రస్తావన అతి తక్కువ.
ఇక మీ సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను
నోట్: అన్నా చెల్లెళ్ళ పెళ్లిళ్ల ప్రస్తావన అబ్రహాం దగ్గరే కాదు అనేక చోట్ల కనిపిస్తుంది.
మోసే ధర్మ శాస్త్రం (యెహోవా ఆజ్ఞలు) వచ్చాక కూడా అన్నాచెల్లెళ్ల పెళ్లిళ్ల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది.
అర్థం అయింది కాదా. అబ్రాహాము, సారా ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. కాని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.