Joseph doubts Mary

Joseph doubts Mary

అమాయకుడు/త్యాగశీలుడు యోసేపు

కట్టుకున్న భార్య వర్జినో కాదో తెలియాలంటే “బట్టని” చెక్ చేసి తెలుసుకునే ఆచారం యూదులకు ఉంది. కానీ మోసే మేరీకు ఆ పరీక్ష ఎందుకు చేయించలేదు?

భార్య కన్య అవునో కాదో తెలియాలంటే ఏ పరీక్ష చేయాలి?

ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.
అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని ఆ చిన్నదాని తండ్రికియ్య వలెను (ద్వితీయోపదేశకాండము 22:17-18)

Now he has slandered her and said,`I did not find your daughter to be a virgin.- But here is the proof of my daughter-s virginity.” Then her parents shall display the cloth before the elders of the town, and the elders shall take the man and punish him.
They shall fine him a hundred shekels of silver and give them to the girl-s father, because this man has given an Israelite virgin a bad name. (Deuteronomy 22:17-18)

యోసేపు ఈ బట్ట పరీక్ష ఆరోజున చేయించి ఉంటే యెహోవా గొప్పతనం, మేరీకి గర్భం పరిశుద్ధ ఆత్మ వలనే వచ్చింది అన్న విషయం ఆరోజే లోకానికి తెలిసి ఉండేది. డామిట్. యోసేపు ఆ పని చెయ్యలేదు. మా యేసయ్యని అందరి చేత మాటలు పడేలా చేశాడు.

నిజానికి యోసేపుకిట్ తన భార్య మేరీ పైన అనుమానము కలిగింది. ఆమెను వదిలేద్దాం అని కూడా ఫిక్స్ అయ్యాడు.

యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. (మత్తయి 1:18-19)

This is how the birth of Jesus Christ came about: His mother Mary was pledged to be married to Joseph, but before they came together, she was found to be with child through the Holy Spirit.
Because Joseph her husband was a righteous man and did not want to expose her to public disgrace, he had in mind to divorce her quietly. (Matthew 1:18-19)

ఆమెను అవమాన పరచడం ఏమిటి ?

నిజంగా మేరీ తప్పు చేస్తే ఆమెను సజీవ దహనం చేసేవారు యూదులు.

అది సరే, కాబోయే భార్యపై అనుమానం వస్తే పంచాయితీ పెట్టి, గుడ్డ పరవమని చెప్పాలి. కానీ యోసేపు రహస్యముగా వదిలేద్దాం అనుకోవడం ఏమిటి? ఎందుకు అలా అనుకున్నాడు? ఏమో.. వదిలేద్దాం అనుకున్నాడు సరే వదిలేయవచ్చుగా ?

అక్కడే ఒక పెద్ద ట్విస్ట్. యెహోవా యొక్క దేవదూత యోసేపుకి ఫ్లాష్ బ్యాక్ అంతా విప్పి చెప్పింది/చెప్పాడు.

అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది. (మత్తయి 1:20)

But after he had considered this, an angel of the Lord appeared to him in a dream and said, “Joseph son of David, do not be afraid to take Mary home as your wife, because what is conceived in her is from the Holy Spirit. (Matthew 1:20)

ఇలా దేవదూత కలలో కనపడి మేరీ కన్య కానీ ఆమె గర్భవతి అని చెప్పాడు. దాంతో యోసేపుకి అనుమానం పోయింది.

యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. (మత్తయి 1:24-25)

When Joseph woke up, he did what the angel of the Lord had commanded him and took Mary home as his wife. But he had no union with her until she gave birth to a son. And he gave him the name Jesus.(Matthew 1:25)

తన భార్య మేరీ పరిశుద్దాత్మ వలన గర్భవతి అయింది అని తెలిసిన మరుక్షణం నుండి ఆమెతో శృంగారం చేయకుండా ఉన్నాడు యోసేపు.

ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే గర్భవతి అయిన భార్యపైన అనుమానం ఉంటే మోసే/యెహోవా చెప్పినట్టు బట్ట పరీక్ష చేసి తేల్చుకోవాలి అంతే కానీ ఎవరో కలలో కొచ్చి చెప్పారు అని ఊరుకోవడం ఏమిటి? ఆరోజు ఆ పరీక్ష ఏదో చేసేసి ఉంటే మేరీ గొప్ప కన్య అని , ఆమె వాడెవడో సైనికుడితో .. అని ఈరోజు మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా! మొత్తం చెడగొట్టేశాడు పెద్దాయన.

ఓకే. భార్య పైన నమ్మకం కుదిరింది. ప్రేగ్నన్ట్ భార్యతో శృంగారం చేయకూడదా? అప్పటికి సైన్స్ తెలియక అలా చేసి ఉంటాడు. ప్రెగ్నన్సీ వరకు ఆగాడు అంటే ఆ తర్వాత చేసే ఉంటాడా ? మరి ఇప్పటికీ వర్జిన్ అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?

మళ్ళీ నేనే తండ్రిని అంటూ యోసేపు, తల్లిని అంటూ మేరీ, యేసుని తీసుకొని పోయి సున్నతి చేయించి మోసే ధర్మ శాస్త్రాన్ని , యూదులను మోసం చేయడం ఎందుకు ?

ఇక్కడ బైబిల్ రచయిత తిప్పిన మలుపులు భలే తమాషాగా ఉంటాయి.

  1. భర్తకు అనుమానము రావడం, సీక్రెట్ గా వదిలేద్దాం అనుకోవడం.
  2. దేవదూత ఆ విషయాన్ని గ్రహించి, భర్త కలలోకి రావడం
  3. భర్త ఆమెను బిడ్డను కనే వరకూ ముట్టకుండా ఉండటం.
  4. నేనే తండ్రిని అంటూ ఆ తండ్రి కొడుక్కి సున్నతి చేయించడం
  5. మోసే ధర్మ శాస్త్రాన్ని తుంగలోకి తొక్కి ఒక జంట ప్రాణాలతో బయట పడటం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *