
చూసే కళ్లను బట్టి అర్ధం మారుతుంది..!
మాజీ హిందువులకు నా సందేశం
హిందూ గ్రంధాలపై కనీశ అవగాహన లేక, పాస్టర్లు, తోటి మనుషులు చేసిన తప్పుడు ప్రచారాలకు లోబడి మతం మారిన మాజీ హిందువులు జీవిత కాలం తోటి హిందువులను, హిందూ గ్రంధాలను విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు.
మతం మారి వారి మానాన వారు బ్రతకకుండా సమాజంలో అల్లర్లకు కారణం అవుతున్నారు.
దీంతో హిందువులు కూడా బైబిల్ చదవడం మొదలుపెడుతున్నారు.
ఫలితంగా ఏం జరుగుతుంది ?
పరిశుద్ధ గ్రంధం తెలుగులోనే అందుబాటులో ఉండటంతో అందులో ఉన్నదంతా వారికి మిగతా గ్రంధాల కంటే బెటర్ గా అర్ధం అవుతోంది .
తమ గ్రంథాలను పనిగట్టుకొని విమర్శిస్తూ, వేదాలలో యేసు, త్రైత సిద్ధాంత భగవద్గీత ఒకటేమిటి .. ఎన్నో గ్రంథాలు మాజీ హిందువుల చేత రాయబడుతూ ఉంటే ఒళ్ళు మండి కొందరు హిందువులు కూడా తమకు తెలిసిన బైబిల్ వాక్యాలు ఉదాహరణలుగా చూపిస్తున్నారు.
ఇక్కడ నేను ఉదాహరించిన వాక్యం చూడండి.
అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. (పరమగీతము 2:3)
Like an apple tree among the trees of the forest is my lover among the young men. I delight to sit in his shade, and his fruit is sweet to my taste. (Song of Songs 2:3)
ఇక్కడ ఒక స్త్రీ నేను నా ప్రియుడి నీడలో కూర్చున్నాను. నా ప్రియుడి ఫలం నా నోటికి రుచిగా ఉంది (మధురం) అంటోంది.
మనం ఇందులో నుండి ఏ అర్ధం కావాలంటే ఆ అర్ధం తీసుకోవచ్చు.
సాధారణ జనం కూడా ఇందులో పెద్ద బూతు అర్ధం ఉంది అని చెప్పేస్తారు.
కానీ ఒక పాస్టర్ దగ్గరకు వెళ్లి అడిగితే అది దేవుడు తన సంఘం గురుంచి చెప్తున్నాడు అంటారు.
దాంతో క్రైస్తవులు అవును కదా మనమే తప్పుగా అర్ధం చేసుకున్నాం అని సర్ది చెప్పుకుని క్రైస్తవంలో కొనసాగుతారు.
మరి మాజీ హిందువులుగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ?
మీకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఏ గురువుని కలిశారు?
ఏ పీఠాధిపతిని మీ ధర్మ సందేహాలు తీర్చమని కోరారు?
మీరు మీ సందేహాలు సందేహాలుగా ఉండగానే మతం మారి, చర్చిలో పాస్టర్ గారు హిందూ ధర్మంపై నూరిపోస్తున్న హిందూ వ్యతిరేక భావజాలంతో మరిన్ని సందేహాలను పెంచుకొని, రోజూ మీ కుటుంబ సభ్యులైన మాజీ హిందువులతో వైరం పెంచుకుంటున్నారు.
మీరు మతం ఎందుకు మారారో మీకు తెలియాలి అంటే మీ హిందూ గ్రంధాలపై మీకు ఉన్న సందేహాలను శాస్త్రం తెలిసిన పండితుల దగ్గర నివృత్తి చేసుకోండి.
మిమ్మల్ని మతోన్మాదులుగా చెయ్యాలని చూస్తున్న కొన్ని వర్గాలకు అవకాశం ఇవ్వొద్దు.
మీ శ్రేయోభిలాషి
రమణ నేషనలిస్ట్