Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

the eye of a needle gate in Jerusalem Telugu

the eye of a needle gate in Jerusalem Telugu

సూదిబెజ్జములో ఒంటె-యేసు చెప్పింది ఈ గేట్ గురించేనా? camel to go through the eye of a needle gate in Jerusalem Telugu

ధనవంతులు స్వర్గంలో ప్రవేశించడం దుర్లభమా ?అసంభవమా?

చాలా మంది క్రైస్తవుల వాదన ప్రకారం ధనవంతులు స్వర్గంలోకి ప్రవేశించడం అసంభవం. (Impossible to enter heaven)

దీనికి వాళ్ళు చూపించే బైబిల్ వాక్యం:

ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. (మత్తయి 19:24)

Again I tell you, it is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God. (Matthew 19:24)

మార్కు 10:25
ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.

ఈ వాక్యాలలో యేసు చెప్పిన మాటలు నిజమైన సూది బెజ్జము గురించే అనే భావనతో వారు ఇలా మాట్లాడతారు. అయితే కొందరి వాదన ప్రకారం ఇక్కడ ప్రస్తావించబడిన సూదిబెజ్జం లో ఒంటె దూరడం అనేది యెరుసలేంలో అదే పేరుతో ఉండే ఒక గేట్ గురించి అని కొందరు వాదిస్తున్నారు.

ది కేమెల్ ఇన్ ది నీడిల్ అని పిలవబడే ఈ గేట్ ని చిత్రం లో చూడవచ్చు. అలాగే ఈ లింక్ ద్వారా ఆ గేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుకోవచ్చు.

http://www.best-travel-deals-tips.com/jerusalem-eye-of-the-needle-gate.html

ఆ గేట్ ద్వారాలు చాలా ఇరుకుగా ఉన్నందున ఒంటెలు సునాయాసంగా ప్రవేశించలేవు. కానీ కొంచెం వంగి, కొంచెం కష్టపడితే వెళ్లిపోగలవు. అలాగే ధనవంతులు కూడా తమకున్న ధనాన్ని కొంత వదులుకుంటే స్వర్గం చేరుకోవచ్చు అనే అర్ధం పై వచానానికి వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ధనవంతులు అసలు స్వర్గానికి చేరరు అనే వాదన తప్పు అంటారు కొందరు క్రైస్తవులు.

మరికొందరు ఈ గేట్ థియరీ బూటకమని కొట్టి పడేస్తారు. వారి వాదన ప్రకారం సాధారణ సూదిబెజ్జంలో ఒంటె దూరి వెళ్లలేనట్టే ధనవంతులు కూడా ఎట్టి పరిస్థితిలోనూ స్వర్గం చేరలేరు. కాబట్టి క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనం కూడబెట్టరాదు. ఉన్నదంతా అందరికీ ఇచ్చేసి అడుక్కు తినాలి అనేలా ఉంటాయి వీరి మాటలు. అలాగే వీరి మాటల ప్రకారం డబ్బున్న పాస్టర్లు, డబ్బున్న క్రైస్తవులు స్వర్గంలో ప్రవేశించడానికి అనర్హులు.

అయితే వీరి వాదనని బైబిల్ కాంట్రడిక్ట్ చేస్తోంది.

క్రైస్తవులు వాదిస్తున్నట్టు ఒకవేళ ధనవంతులకు స్వర్గ ప్రవేశం లేకపోతే తన యాజకులను ధనవంతులగా చేస్తానని యెహోవా ఎందుకు చెప్పాడు? యాజకులు స్వర్గంలోకి ప్రవేశించకుండా యెహోవా చెయ్యాలనుకున్నాడా?

మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు. (యెషయా 61:6)


Isaiah 61:6

And you will be called priests of the LORD, you will be named ministers of our God. You will feed on the wealth of nations/gentiles, and in their riches, you will boast.

యెషయా 61:7

మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.

Isaiah 61:7

Instead of their shame my people will receive a double portion, and instead of disgrace they will rejoice in their inheritance, and so they will inherit a double portion in their land, and everlasting joy will be theirs.

ధనం స్వర్గంలోకి ప్రవేశించడానికి ఆటంకమైతే యాజకులకు అన్యుల సొమ్మును యెహోవా ఎందుకు ఇస్తాను అని ప్రామిస్ చేశాడు?

సామెతలు 10:22

యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.


Proverbs 10:22

The blessing of the LORD brings wealth, and he adds no trouble to it.

ధనమిచ్చిన దేవుడు స్వర్గానికి రాకుండా చేస్తాడా? he adds no trouble to it. గమనించగలరు.

అన్య దేశాల దగ్గర డబ్బులు దొబ్బేయడానికి దేవుడే అవకాశం ఇచ్చి ఇప్పుడు స్వర్గంలోకి రావద్దు అంటాడా?

1 thought on “సూదిబెజ్జములో ఒంటె-యేసు చెప్పింది ఈ గేట్ గురించేనా?

  1. Hoᴡdy! I’m ɑt work browsing your blog from my new aⲣpⅼe iphone!
    Just wanted to say I love reaԀing your
    blog and loοk forward to all your posts! Carry on the superb work!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *