
పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అని బైబిల్ చెప్పిందా?
పాండురంగ మహత్యం పోస్ట్ కి గంట గారి కౌంటర్ లో నిజమెంత?
ఆయన పెట్టిన బైబిల్ వచనాలు (ఎఫెసీయులకు 6:1,2,3) ఎంత పచ్చి అబద్ధాలో గమనించండి.
మొదటి వాక్యం అర్ధం అయితే మొత్తం అర్ధం అవుతుంది.
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. (ఎఫెసీయులకు 6:1)
Children, obey your parents in the Lord, for this is right. (Ephesians 6:1).
ఇక్కడ పిల్లలు తమ తల్లి తండ్రుల మాట వినమని ఉందా?
ప్రభువునందు తల్లిదండ్రుల మాట వినమని ఉందా? తల్లి తండ్రులు , ప్రభువు నందు తల్లిదండ్రులు రెండిట్లో తేడా ఏమిటి?
ఇది మనకు అర్ధం అవ్వాలంటే ఇలాంటి మరో బైబిల్ వాక్యం.
భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను. (1 కోరింథీయులకు 7:39)
A woman is bound to her husband as long as he lives. But if her husband dies, she is free to marry anyone she wishes, but he must belong to the Lord. (1 Corinthians 7:39)
ఇక్కడ “విధవరాలు తనకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోమని” చెప్పిన బైబిల్ అదే వాక్యంలో “ప్రభువు నందు” అనే పదాలు చేర్చి మెలిక పెట్టింది.
అలాగే ఎఫెసీయులకు 6:1 లో కూడా ప్రభువు నందు తల్లి దండ్రులకు అనే మెలిక పెట్టింది. మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి అంటే సరిపోయేది కదా! ప్రభువునందు అని ఎందుకు చేర్చారు?
ఎందుకు అంటే మతమార్పిడి ఇబ్బంది కలుగకూడదు కాబట్టి.
ఉదాహరణకు : మిషనరీ స్కూల్లో చదివే ఒక హిందూ పిల్లాడు మతమార్పిడి గురి అయ్యి తల్లి తండ్రులతో గొడవ పడి, పాస్టర్ దగ్గరకు వచ్చి “ఫాదర్ .. మా తల్లి దండ్రలు హిందువులు. నన్ను వారి మాట వినమంటారా ? వద్దా ? అంటే
అప్పుడు ఈ వాక్యం చూపించి…
ఇక్కడ చూడు
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. (ఎఫెసీయులకు 6:1)
Children, obey your parents in the Lord, for this is right. (Ephesians 6:1).
ఇక్కడ ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి అని ఉంది తప్ప హిందూ తల్లి దండ్రుల మాట వినమని కాదు నాయనా అని చెప్పడానికి.
అలాగే క్రైస్తవ విధవరాలు హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆమెను కంట్రోల్ చేయవచ్చు. బైబిల్లో ఇలాంటి వాక్యాలు అందుకే చాలా జాగ్రతగా రాయబడ్డాయి.
కాబట్టి గంటా కృపారావు గారు చూపించిన బైబిల్ వాక్యాలు సరిపోలేదు. బైబిల్ అందరి తలిదండ్రులను కాక కేవలం ప్రభవునందు తల్లిదండ్రులకు మాత్రమే విధేయులై ఉండమని మాత్రమే బైబిల్ చెప్పింది అని నిరూపించడమైనది.