పాత నిబంధన ప్రకారం పచ్చబొట్లు పొడిపించుకోవడం యెహోవాకు హేయం
చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను. (లేవీయకాండము 19:28)
“`Do not cut your bodies for the dead or put tattoo marks on yourselves. I am the LORD (Leviticus 19:28)

స్వయంగా యేసయ్యే తన తొడ మీద రాజులకు రాజు అని రాయించుకున్నడంట !
అది కూడా స్వర్గంలో ..!
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది. (ప్రకటన గ్రంథం 19:16)
On his robe and on his thigh he has this name written: KING OF KINGS AND LORD OF LORDS. (Revelation 19:16)
ఇది ఖచ్చితంగా పచ్చబొట్టే. స్వర్గంలో పెన్ తో రాసుకున్నాడు అనడం అంత బాగుండదు కదా !
ఈ రిఫరెన్స్ కంటే ముందు ఉన్న వచనాలు చూడండి.
మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.
(ప్రకటన గ్రంథం 19:11)
ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; (ప్రకటన గ్రంథం 19:12)
ఈ యేసు తొడ మీద పచ్చబొట్టు వలన మనకు కొన్ని విషయాలు అర్ధం అవుతోంది.
- యేసు గుర్రం పైన వస్తాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే యేసుకి శరీరం ఉంది.
- యేసుకి తొడ కూడా ఉంది.
- స్వర్గంలో కూడా గుర్రాలు ఉంటాయి.
- యేసుకి శిరస్సు ఉంటుంది. ఒకే తలకాయ మీద అనేక కిరీటాలు ఉంటాయి.
- యేసుకి మరో పేరు దేవుని వాక్యం అని తర్వాత వాక్యంలో ఉంటుంది.
ఇలా అనేక విషయాలు మనకు ఈ చాప్టర్ లో తెలుస్తాయి.
అయితే యేసు తొడ మీద రాసి ఉన్న విషయం మిగతా వాళ్లకు కనపడింది అంటే యేసు షార్ట్ వేసుకుని ఉన్నాడా ? లేక పిక్చర్ లో ఉన్నట్టు డ్రెస్ వేసుకున్నాడా ? ఇంతకీ అది ఏ భాషలో రాసుకున్నాడు? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకు అంటే స్వర్గంలో ఉండే వాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటారో మనకు తెలియడానికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది .
పచ్చబొట్టు వేసుకోవద్దు అని యెహోవా చెప్పిన మాట ఉండగా యేసు తొడ మీద ఎందుకు రాయించుకున్నాడు?
గజినీ లాగా మర్చిపోకుండా ఉండటానికా?