నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.(ఆదికాండము 7:23)
నేడు ప్రపంచాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు, లోకం కొరకు తన కుమారుడిని త్యాగం చేసిన దేవుడు, అని పిలవబడుతున్న బైబిల్ దేవుడు చేసిన అతి ఘోరమైన చర్య ఇది.
లోకం పాపంతో నిండి పోయి ఉంది అని భావించిన బైబిల్ దేవుడు ఒక 10 మందిని తప్ప మానవులు అందరినీ చంపేసిన సంఘటన ఇది.
నాటి జనాభా అంచనా ప్రకారం కనీశం ఒక 20 లక్షల మంది ప్రజలు యెహోవా చేతిలో చనిపోయి ఉండవచ్చు.
ఈ సందర్భంలో మనుషులను యెహోవా ఎందుకు చంపాడు.
కారణం అప్పుడు అందరూ పాపం చేశారు అని బైబిల్ దేవుడు భావించాడు.
related posts: