నియమం – తండ్రి మాట వినని కొడుకుని ఖచ్చితంగా చంపేయాలి
ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షిం చిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాక పోయిన యెడల అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగ బడి యున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్ప వలెను అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు. (ద్వితీయోపదేశకాండము 21:19-21)
బైబిల్ ప్రకారం ఆదాము కొడుకు. కనుక యెహోవా తన కొడుకైన ఆదాముకి ఇదే శిక్ష విధించాడు.
కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. (లూకా 3:38)
the son of Enosh, the son of Seth, the son of Adam, the son of God. (Luke 3:38)
యెహోవా(తండ్రి) మాట వినని ఆదాము (కొడుకు):
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. (ఆదికాండము 2:17)
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను. (ఆదికాండము 3:6)
ఆదాము చావుకి కావాల్సిన ఏర్పాట్లు చేసిన యెహోవా:
అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. (ఆదికాండము 3:22-23)
……
ఆ పండు తింటే చస్తావు అని యెహోవా చెప్పాడు. పండు తిన్న ఆదాము చావలేదు. కానీ ఆదాము చావాలంటే అతడు ఆ పళ్ళు తినకూడదు. అక్కడ నుండి వెళ్ళిపోవాలి. అక్కడ నుండి యెహోవా ఆదాముని వెళ్ళగొట్టాడు కాబట్టే ఆదాము చనిపోయాడు. అంటే ఆదాముని యెహోవాయే చంపేశాడు. ఇది బైబిల్లో మొదటి హత్య. నిజానికి సర్వ హవ్వ ఆదాముల చావుకి యెహోవాయే కారణం. పైగా యెహోవా తన ఖడ్గాన్ని తోటకి కాపలాగా పెట్టాడు. అంటే ఆదాము ఖచ్చితంగా చావాలి అని యెహోవా బలంగా కోరుకున్నాడు. (
- అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. (ఆదికాండము 3:24)
గమనిక: నిజానికి యెహోవా ఈ నియమాన్ని కొంచెం మర్చి మోషేకు చెప్పాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రులు వాళ్ళని చంపేయాలి అన్నది యెహోవా చేసి చూపించిన నియమాల్లో ఒకటి.