Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

Type-1: వెల ఇచ్చి కొనబడిన బానిసలు

బైబిల్లో అనేక రకాల బానిసలు ఉన్నారు. వారిలో ధనంతో కొనబడిన బానిసలు మొదటి కేటగిరీ బానిసలు.

వీరిని వెండితో కొంటారు. ఇజ్రాయెల్ బానిసలను సాధారణంగా స్వీకరించరు. ఒకవేళ తీసుకున్నా(కొనుక్కున్నా ఎక్కువ కష్ట పెట్టరు. కానీ ఇరత దేశాల బానిసలను కొనుక్కున్నప్పుడు వారికి చుక్కలు చూపిస్తారు.

దాసుడు/దాసి అనే అనే తెలుగు పదాలు עֶ֥בֶד ( ‘e·ḇeḏ) అనే హీబ్రూ పదం కోసం ఉపయోగించబడ్డాయి. బైబిల్లో దాసుడు అనే పదం ఉపయోగింపబడిన సందర్భాల్లో ఎక్కువగా బానిస అనే అర్థమే తీసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ కొనబడిన, అమ్మబడిన అనే పదాలు ఉపయోగించబడ్డాయి. పనివాళ్లను (సర్వెంట్స్ ని ) కొనడం అమ్మడం ఉండదు కాబట్టి.

మగ బానిస:
వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును. (నిర్గమకాండము 12:44)
Any slave you have bought may eat of it after you have circumcised him. (Exodus 12:44)

సున్నతి అనే ఆచారం శరీరానికి సంబందించినది. పనివాళ్ల శరీరంపై యజమానికి అధికారం ఉంటుందా? ఉండదు కదా. బానిస అయితేనే చచ్చినట్టు యజమాని మాట వింటాడు. సున్నతి చేయించుకుంటాడు. ఇక్కడ వెండితో కొనబడిన వాడు బానిస. కొన్ని ఆంగ్ల అనువాదాల్లో సర్వెంట్ అని వాడుతున్నారు. నిజానికి ఇక్కడ చెప్పబడింది బానిస గురుంచే.

ఆడ బానిస:
ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.(నిర్గమకాండము 21:7)
If a man sells his daughter as a servant, she is not to go free as menservants do. (Exodus 21:7)

ఆర్థిక ఇబ్బందుల వలన ఒక తండ్రి తన కూతురిని అమ్మే సందర్భం పైన వివరించబడింది. మగ బానిసలు యజమాని పెట్టే టార్చర్ భరించలేక పారిపోవడం పరిపాటి. కాబట్టి స్త్రీ బానిసలు అలా పారిపోకూడదు అని ఈ వాక్యం చెబుతోంది. ఈ నియమం పెట్టింది మోసే. మోషేకు ఆ మాట చెప్పమని చెప్పింది యెహోవా.

బానిసను వెల ఇచ్చి విడిపించుకోవడం:

లేవీయకాండము 19:20
ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.

Leviticus 19:20
“`If a man sleeps with a woman who is a slave girl promised to another man but who has not been ransomed or given her freedom, there must be due punishment. Yet they are not to be put to death, because she had not been freed.

ఒక స్త్రీని కానీ పురుషుడిని కానీ వెండితో కొన్న తర్వాత ఆ బానిసను ఎవరైనా విడిపించాలి అనుకుంటే అంతకంటే ఎక్కువ ధనమిచ్చి విడిపించుకోవచ్చును. అది కూడా ఆ యజమానికి ఇష్టం అయితేనే. అప్పటి వరకూ ఆ బానిస యజమాని చెప్పినట్టు పని చెయ్యాలి. ఆ బానిస ఆ యజమాని సొత్తు (సొమ్ము).

ఆ బానిసను కొట్టొచ్చు. ఏమైనా చెయ్యొచ్చు. ఆమెను/అతన్ని ఎవరైనా వచ్చి విడిపించే వరకు సాధారణ జనాలకు వర్తించే నియమాలు బానిసలకు వర్తించవు. అంటే వారు సాధారణ పౌరుల వలె కొన్ని హక్కులను కలిగి ఉండరు. నిశ్చయం చేయబడిన బానిస స్త్రీ తో ఒకడు పడుకుంటే మరణ శిక్ష పడదు. కానీ నిశ్చయం చేయబడిన సాధారణ పౌరురాలితో ఒకడు పడుకుంటే మరణశిక్ష ఉంటుంది అనే నియమం ఇక్కడ వచనంలో ఉంది.

ధనం చెల్లించి మనుషులను కొనడం తప్పు అని యెహోవా చెప్పలేదు. పైగా ఎలా కొనాలి. వారిని ఎలా పాలించాలి అనే నియమాలు యెహోవానే ఇచ్చాడు. కాబట్టి యెహోవా కనుసన్నల్లోనే బైబిల్లో బానిసత్వం కొనసాగింది.

మరో రకమైన బానిసల గురించి మరో పోస్టులో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *