బైబిల్ బానిసలు టైప్ -2 (యుద్ధ వ్యర్థాలు)

యుద్ధంలో దొరికిన మనుషులను కొల్లసొమ్ము అంటుంది బైబిల్. వారిని ఇశ్రేయేలీయులు అనుభవించవచ్చు అంటాడు యెహోవా.

అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు. (ద్వితీయోపదేశకాండము 20:14)

As for the women, the children, the livestock and everything else in the city, you may take these as plunder for yourselves. And you may use the plunder the LORD your God gives you from your enemies. (Deuteronomy 20:14)

ఇశ్రాయేలీయులు చుట్టుపక్కల దేశాలపై మోసే ఆజ్ఞతో దండ యాత్రలు చేసినప్పుడు మగవారందరినీ చంపేయగా దొరికిన స్త్రీలను బానిసలుగా చేసుకునేవారు. పెళ్లి ఐన స్త్రీలను నిర్ధాక్షిణంగా చంపేశారు. అందగత్తెలు పెళ్లి చేసుకునేవారు. సంతృప్తి పొందితే ఓకే. సంతృప్తి కలిగించని స్త్రీలను వదిలేసే వారు. తమకు పెళ్ళికి పనికి రాని స్త్రీలను బానిసత్వంలోకి నెట్టేవారు. పురుషులను బానిసలుగా చేసుకునేవారు.

కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి. (సంఖ్యాకాండము 31:17-18)

Now kill all the boys. And kill every woman who has slept with a man, but save for yourselves every girl who has never slept with a man. (Numbers 31:17-18)

ఐతే ప్రతి స్త్రీని ఒకలాగే చూడరు. అందగత్తెలు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం బైబిల్ దేవుడి ప్రత్యేకత.

అందమైన స్త్రీలకు బోడి గుండు చేయించి నెల రోజుల తరువాత పెళ్లి చేసుకోవచ్చు. కొన్ని రోజులు వాడుకున్న తర్వాత ఆయా స్త్రీల వలన సంతృప్తి చెందని పక్షంలో ఆ స్త్రీలను వదిలేయాలి. బానిసలను అమ్మినట్టు వారిని అమ్మరాదు. ఇది కేవలం పెళ్ళి చేసుకున్న స్త్రీలకే వర్తిస్తుంది.

నీవు నీ శత్రువులతో యుద్ధముచేయ బోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడినవారిలో రూపవతి యైనదానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసికొన మనస్సయి నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ యింట నివసించి యొక నెలదినములు తన తండ్రులనుగూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును. (ద్వితీయోపదేశకాండము 21:10-13)

నీవు ఆమెవలన సంతుష్టి నొందనియెడల ఆమె మనస్సువచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు; నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు. (ద్వితీయోపదేశకాండము 21:14)

ఇలా యుద్ధం జరిగిన ప్రతి సారి జరుగుతుంది.

ఇలా దొరికిన స్త్రీలలో యెహోవా వంతు /వాటాను ప్రధాన యాజకుడు స్వీకరిస్తాడు. వారు ఆ స్త్రీలను ఏం చేస్తారు?

యెహోవా ఆలయం యాజకులు బానిసత్వాన్ని ప్రోత్సహించేవారు.

అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. (లేవీయకాండము 22:11)

కాబట్టి వారు ఈ యుద్ధ వ్యర్థాలను అందరూ చూసిన పద్దతిలోనే యాజకులు కూడా చూసేవారని భావించవచ్చును.

పైనవచనాల్లో ఎక్కడ స్త్రీ ఇష్టాయిష్టాలతో సంబంధం ఉందా? మగవాళ్ళు యుద్ధానికి పోతే స్ట్రీలను కొల్లగొట్టడం,దోచుకోవడం తప్ప స్త్రీ కనీశం తన ఇష్టం ప్రకారం జీవించగలిగిందా? కాబట్టి ఈ స్త్రీలు బానిసత్వాన్ని అనుభవించారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదంతా యెహోవా కనుసన్నల్లో జరిగిన తతంగమే.

మరో పోస్టులో మరో టైప్ బైబిల్ బానిసల గురించి తెలుసుకుందాం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *