
స్వదేశీ Vs విదేశీ బానిసలు
ఇజ్రాయెల్లో పరదేశీ బానిసలు అనగా ఇజ్రాయేల్ చుట్టూ పక్కల ఉన్న దేశాల నుండి కొనబడిన బానిసలు, ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తున్న నాన్-లోకల్ బానిసలని ఎలా ట్రీట్ చేయాలో యెహోవా అలాగే బైబిల్లో వివరించాడు. అలాగే ఇజ్రాయెల్ వారిని బానిసలుగా చేసుకున్నప్పుడు ఎలా ట్రీట్ చెయ్యాలో యెహోవా వివరించాడు.
నా దగ్గర ఉన్న తెలుగు బైబిల్ నుండి ఫోటో పెట్టాను చూడండి. అలాగే బైబిల్ రిఫరెన్స్ లు ఇక్కడ కూడా పెడతాను చదవండి.
స్వదేశీ బానిస/ఇజ్రాయెల్ బానిస:
1. నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత #బానిససేవ చేయించుకొన కూడదు. (లేవీయకాండము 25:39)
“`If one of your countrymen becomes poor among you and sells himself to you, do not make him work as a slave. (Leviticus 25:39)
ఇక్కడ బానిస అనే పదం కోసం వాడబడిన హీబ్రూ పదం עָֽבֶד׃ (‘ā-ḇeḏ.)
2. వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. (లేవీయకాండము 25:40)
He is to be treated as a hired worker or a temporary resident among you; he is to work for you until the Year of Jubilee. (Leviticus 25:40)
జీతం తీసుకునే జీతగాడిలాగా అతన్ని ట్రీట్ చెయ్యాలి. కొంత కాలం నీ ఇంట ఉండటానికి వచ్చిన temporary resident లాగా అతన్ని ట్రీట్ చెయ్యాలి. అలాగే కొంత కాలం అతన్ని స్వతంత్రుడిని చెయ్యాలి.
3. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను. (లేవీయకాండము 25:41)
Then he and his children are to be released, and he will go back to his own clan and to the property of his forefathers. (Leviticus 25:41)
4. ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. (లేవీయకాండము 25:42)
Because the Israelites are my servants, whom I brought out of Egypt, they must not be sold as slaves. (Leviticus 25:42)
ఇక్కడ యెహోవా అసలు విషయం బయట పెట్టాడు. తాను ఇజ్రాయెల్ వారిని విడిపించుకున్నాడు కాబట్టి వారు తనకే దాసులుగా ఉండాలి. వేరొకరికి దాసులుగా ఉండకూడదు.
ఇక్కడ కూడా బానిస అనే పదానికి עָֽבֶד׃ (‘ā-ḇeḏ.) అనే హీబ్రూ పదం వాడబడింది.
5. నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము. (లేవీయకాండము 25:43)
Do not rule over them ruthlessly, but fear your God. (Leviticus 25:43)
మరి విదేశీయులను యెహోవా విడిపించి తీసుకురాలేదు కదా. వారిని ఎలా ట్రీట్ చెయ్యాలి?
అది కూడా చూడండి.
విదేశీ బానిసలు:
1. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. (లేవీయకాండము 25:44)
“`Your male and female slaves are to come from the nations around you; from them you may buy slaves. (Leviticus 25:44)
2. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు. (లేవీయకాండము 25:45)
You may also buy some of the temporary residents living among you and members of their clans born in your country, and they will become your property. (Leviticus 25:45)
3. మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు #శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు. (లేవీయకాండము 25:46)
You can will them to your children as #inherited#property and can make them slaves for life, but you must not rule over your fellow Israelites ruthlessly. (Leviticus 25:46)
చదివారు కదా. కాబట్టి తాను విడిపించిన ఇజ్రాయెల్ వారిని బానిసలుగా ఎందుకు చూడకూడదు. ఇతరులను ఎలా చూడాలో వివరించిన విధానం అందరికీ అర్ధం అయిందని భావిస్తాను.