మూల పదం ఒక్కటే అనువాదాలు వేరు వేరు.

యెహోవా సర్వెంట్స్ VS ఫరో బానిసలు

ఈ క్రింది బైబిల్ వచనాల్లో ఉన్న దాసుడు అనే పదాన్ని గమనించగలరు.

ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే #దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను. (లేవీయకాండము 25:55)

నీవు నీ కుమారునితో ఇట్ల నుముమనము ఐగుప్తులో ఫరోకు #దాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను.(ద్వితీయోపదేశకాండము 6:21)

రెండు చోట్ల దాసుడు అనే పదం ఉపయోగించబడింది. ఆ రెండు ఒకే అర్ధాన్ని ఇస్తాయి. ఒకదాంట్లో యెహోవాకు దాసులు మరో చోట ఫరో కు దాసులు అని తెలుగు బైబిల్లో చెప్పబడింది.

ఇప్పుడు ఆంగ్ల అనువాదాలు చూడండి.

for the Israelites belong to me as #servants. They are my servants, whom I brought out of Egypt. I am the LORD your God. (Leviticus 25:55)

tell him: “We were #slaves of Pharaoh in Egypt, but the LORD brought us out of Egypt with a mighty hand. (Deuteronomy 6:21)

(עֲבָדִ֔ים ) ‘ă-ḇā-ḏîm, అనే హీబ్రూ పదానికి దాసుడు అని తెలుగులో అనువాదం చేశారు. కొన్ని ఆంగ్ల బైబిళ్ళలో ఇదే పదాన్ని సర్వెంట్ అని మరికొన్ని వాటిలో స్లేవ్ అని అనువాదం చేశారు .

For the Israelites are My slaves. They are My slaves that I brought out of the land of Egypt; I am Yahweh your God.” Leviticus 25:55 (Holman Christian Standard Bible)

ఇప్పుడు మరో రిఫరెన్స్ దాని తెలుగు అనువాదం చూద్దాం

దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. (ద్వితీయోపదేశకాండము 5:6)

“I am the LORD your God, who brought you out of Egypt, out of the land of slavery. (Deuteronomy 5:6) NIV

“`I am the LORD thy God, who brought thee out of the land of Egypt, from the house of bondage. (Deuteronomy 5:6) KING JAMES VERSION

ఇక్కడ కూడా పైన రెండు వచనాల్లో వాడబడిన (עֲבָדִֽ֑ים׃) ‘ă-ḇā-ḏîm. అనే హీబ్రూ పదమే వాడబడింది.

ఇక్కడ యెహోవా చెప్తున్నాడు. మిమ్మల్ని దాసుల గృహమైన ఐగుప్తు నుండి విడిపించింది నేనే అని .

ఇక్కడ మనం చూసిన 3 బైబిల్ వచనాల్లో సర్వెంట్, స్లేవ్, స్లేవరీ, బాండేజ్ అనే ఆంగ్ల పదాలకు, తెలుగు అనువాదాలకు దాసుడు, దాసుల (గృహం0 అనే తెలుగు అనువాదాలకు మూలం ఒక్కటే పదం. (עֲבָדִֽ֑ים׃) ‘ă-ḇā-ḏîm.

ఒకే పదాన్ని ఎవరి ఇష్టానికి వారు వాడుకొని అనువాదాలు సృష్టించారు.

ప్రస్తుత కాలంలో బానిసత్వం చట్ట విరుద్ధం కాబట్టి అది తమ దేవుడికి ఆపాదిస్తే జనం ఫీల్ అవుతారు కాబట్టి SLAVES OF JEHOVAH అని ఉండాల్సిన చోట SERVANTS OF JEHOVAH అని కొన్ని ఆంగ్ల అనువాదాల్లో రాసుకున్నారు. కొన్నింటిలో ఇప్పటికీ SLA VES OF JEHOVAH అనే ఉంది.

తెలుగులో దాసుడు అని కామన్ గా ఉంది. అయినా కూడా ఆ రెండు ఒకటి కాదు అని వాదించే మహానుభావులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *