
బైబిల్ పిట్టకథలు -2
బైబిల్లో అనేక కథలు ప్రచారానికి నోచుకోలేదు. అలాంటి కథల్లో మాట్లాడే గాడిద కథ ఒకటి.
పిల్లలకు సండే స్కూల్స్ లో చెప్పే ఈ పిట్టకథను కొందరు పెద్దలు కూడా నిజం అని నమ్ముతారు.
ఈ కథ రిఫరెన్స్ నంబర్లు : సంఖ్యాకాండము 22:26-30
context :
బిలాము అనే యజమాని ఒక చోటికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అతనికి వార్నింగ్ ఇవ్వడానికి యెహోవా గారి దేవదూత మార్గ మధ్యలో కత్తిపట్టుకొని నిల్చుంటాడు. బిలాము గాడిదకు దేవదూత కనిపిస్తుంది. దాంతో అది భయపడి మొరాయిస్తుంది. అప్పుడు బిలాము తన గాడిదను కొడతాడు. ఆ సందర్భంలో యెహోవా గాడిదకు మాటలు వచ్చేలా చేస్తాడు. వెంటనే అది మాట్లాడటం మొదలు పెడుతుంది.
యెహోవా దూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అదినీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా
బిలాము నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్న యెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిదనేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు లేదనెను. (సంఖ్యాకాండము 22:26-30)
తర్వాత బిలాము కళ్ళు కూడా యెహోవా తెరుస్తాడు. అతనికి కూడా దేవదూత కనపడతాడు.
అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూతయీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను (సంఖ్యాకాండము 22:31-33)
ఇది క్లుప్తంగా మాట్లాడే గాడిద కథ. ఈ కథ ప్రస్తావన కొత్త నిబంధనలో కూడా ఉంటుంది.
అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు. (ప్రకటన గ్రంథం 2:14)
కాబట్టి యేసు చారిత్రక పురుషుడు అని కొత్త నిబంధన చూసి నమ్మేవారు ఈ మాట్లాడే గాడిద కథను కూడా నమ్మాలి.
ఏ చరిత్ర కారుడైనా గాడిద మాట్లాడుతుంది అని నమ్మగలడా? ఏ శాస్త్రవేత్త అయినా సైన్స్ చదివిన విద్యార్ధి అయినా ఈ పిట్టకథను విశ్వసించగలడా?
కాబట్టి యేసు, బైబిల్ నిజం అని నమ్మితే ఇలాంటి పిట్టకథలు కూడా నమ్మాలి. వేరే ఆప్షన్ లేదు.
మరో బైబిల్ పిట్టకథతో మళ్ళీ కలుద్దాం