
శృంగారగీతాలాపన -4 (పరమగీతం వివరణ)
సోలమన్ రచించిన పరమగీతంలో స్త్రీని అత్యంత అద్భుతంగా వర్ణించాడు.
ఆమె రెండు కుచములు (breasts) అతని దృష్టికి (ఆమె ప్రియుడి దృష్టికి) టవర్స్ లాగా కనిపిస్తున్నాయంట. ఆమె ఒక గోడలాగా కనిపిస్తోందిట. కాబట్టి అతని దృష్టిలో ఎంతో తృప్తికరమైనదిగా కనిపించిందిట.
నేను ప్రాకారమువంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని. (పరమగీతము 8:10)
I am a wall, and my breasts are like towers. Thus I have become in his eyes like one bringing contentment.(Song of Songs 8:10)(NIV )
I am a wall, and my breasts like towers; then was I in his eyes as one that found favor. ((Song of Songs 8:10)(KJV)
ఆమె కుచములను టవర్స్ అని ఆంగ్లంలో అనువదిస్తే తెలుగులో మాత్రం దుర్గములు (FORTS ) అని అనువదించారు.
ఇక్కడ దుర్గములు అంటే భద్రతకు చిహ్నంగా చూశాడు తెలుగు అనువాదకుడు. అంటే ఆమె కన్నె కాబట్టి. ఇలాంటి స్త్రీతో శృంగారం భద్రం అనే అర్ధం వచ్చేలాగా. కానీ ఆంగ్ల అనువాదకులు ఆమె కుచముల ఎత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని టవర్స్ అన్నారు.
ఆమె ఒక గోడలాంటిది. అంటే ఆమె అతనికి రక్షణ కవచం లాంటిది. ఇవన్నీ ఒక వర్జిన్ కి ఉండవలసిన లక్షణాలు అని కవి ఉద్దేశ్యం.
ఆమె కుచముల గురించి కవి వర్ణనలో ఎంతో డెప్త్ కనిపించింది.