Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

శృంగారగీతాలాపన -5 (పరమగీతం వివరణ)

సోలమన్ రచించిన పరమగీతంలో ఒక చోట కావ్యనాయకి తన ప్రియుడితో ఇలా అంటుంది.

నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు. (పరమగీతము 8:1)

If only you were to me like a brother, who was nursed at my mother-s breasts! Then, if I found you outside, I would kiss you, and no-one would despise me. (Song of Songs 8:1) (NIV)

O, that thou wert as my brother, that sucked the breasts of my mother! When I should find thee outside, I would kiss thee; yea, I should not be despised. (Song of Songs 8:1) (KJV)

సోదాహరణంగా ప్రేమికులు బాహ్య ప్రపంచంలో తిరిగేటప్పుడు సమాజం వారిని అడ్డుకుంటుంది. అదే అన్నా చెల్లెల్లు ఊరందరి ముందు ఎంత తిరిగినా, ఏం చేసినా వారిని ఎవరూ ఏమీ అనరు. కాబట్టి నువ్వు మా అమ్మపాలు త్రాగిన నా అన్నవి అయ్యుంటే ఎంత బాగుండేది. అప్పుడు నేను నీతో తిరుగుతూ, నిన్ను ముద్దు పెట్టుకున్నా కూడా ఎవరూ ఏమీ అనేవారు కాదు.

ప్రియుడిని ముద్దు పెట్టుకోవాలి అని ప్రేయసి ఎంత తపిస్తుందో చెప్పడం కోసమే కవి “కొంచెం హద్దు మీరి” కవిత్వం రాసుకున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. అంటే వావివరసలు కూడా పట్టించుకోలేనంత విరహం కవిగారిని ఆవహించింది అని అందరూ సహృదయంతో అర్ధం చేసుకోవాలి.

“ప్రేయసి ప్రియులు – ఒకే తల్లి పాలు త్రాగిన అన్నా చెల్లెల్లు “ఇలాంటి పోలిక మాత్రం నభూతో నభవిష్యతిహి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *