
లోతు సంతానాన్ని (అనగా లోతు కూతుళ్ళు తన తండ్రితో శృంగారం చేసి కనిన సంతానానికి) యెహోవా శిక్షించాడా? కానుకలు ఇచ్చాడా?
లోతు కానీ లోతు కూతుళ్ళు కానీ చేసింది తప్పు అని బైబిల్ దేవుడు ఎక్కడా చెప్పలేదు.
తప్ప తాగి కూతుళ్ళ ద్వారా తండ్రి అయిన లోతు నీతి మంతుడు అని బైబిల్ పేర్కొంటున్నది.
అలాగే కూతుళ్ళను రౌడీ మూకకి అప్పజెప్పుతూ నా కూతుళ్ళు మగవాడి స్పర్శ తెలియని కన్నెపిల్లలు మీ మనసుకి నచ్చింది చేసుకోండి అని చెప్పిన లోతుకి కూడా శిక్ష పడలేదు.
పైగా లోతు సంతానానికి ఒక ప్రాంతాన్నే బహుమతిగా (ఆస్తిగా ఇచ్చాడు యెహోవా)
అలాగే తాను ఇచ్చిన ఆస్తిని వేరే వారి చేతుల్లోకి వెళ్ళకుండా కూడా కాపాడాడు యెహోవా.
లోతు సంతానం పై యెహోవా ప్రేమ అలాంటిది.
మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్య ముగా ఇయ్యను. (ద్వితియోపదేశకాండము 2:9)
వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను. (ద్వితియోపదేశకాండము 2:19)