Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బైబిల్ వైరుధ్యాలు – 1

బైబిల్లో దేవుడు ముందు ఎవరిని సృష్టించాడు?


🐘 మొదట జంతువులేనా?

“దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము…”
— ఆదికాండము 1:25-26

ఈ వాక్యాల ప్రకారం, మొదట దేవుడు జంతువులను సృష్టించాడు, తరువాతే మనుష్యులను సృష్టించాడు.


👨‍🦱 కాదు, ముందే మనిషి!

“నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా భూమినుండి ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నిర్మించి, వాటిని ఆదాము యొద్దకు రప్పించెను…”
— ఆదికాండము 2:18-19

ఇక్కడ చూస్తే, మొదట ఆదామును (మనిషిని) సృష్టించి, ఆ తరువాతే జంతువులను చేసినట్టు ఉంది!


⚠️ స్పష్టమైన వైరుధ్యం

అసలు ఈ రెండు అధ్యాయాలు కలిసే ఒకే గ్రంథంలో ఉంటే,
ఒకచోట జంతువులు ముందు, ఇంకొకచోట మనిషి ముందు అన్నది ఎలా సరిపోతుంది?


🤔 నమ్మాలా? వద్దా?

బైబిలు దేవుని వాక్యమైతే,
అది తొలి పుటల్లోనే ఇలా తలా తోకా లేకుండా రాయబడటమేంటి?

ఇంతకీ దేవుడు నిజంగా సృష్టించాడా?
లేదా రెండు వేఋ వేరు కథల్ని కలిపేసిన ప్రయత్నమేనా ఈ సృష్టికథ?

సందేహమే మిగిలిపోతుంది…

#contradictions in the bible part-1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *