Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

అపరిశుద్ధమైన బైబిల్ అనువాదాలు-4

యేసు తన తల్లిని ఏమని పిలిచేవాడు?

100% ఏనాడూ యేసు మేరీని అమ్మా అని పిలవలేదు. ఎప్పుడూ మేరీ ని ఓ స్త్రీ.. అని సంబోధించేవాడు యేసు.
అయితే తెలుగు బైబిల్లో అమ్మా అని పిలిచినట్టు రాసుకున్నారు. ఇంతకీ యేసు మేరీని అమ్మా అని పిలిచాడా?

Example :1

“Woman, why do you involve me?” Jesus replied. “My time has not yet come.” (John 2:4)

ఇక్కడ మేరీని యేసు Dear Woman అని పిలిచాడు.

అన్నీ ఇంగ్లీష్ అనువాదాల్లోను woman అనే ఉంది.

https://biblehub.com/john/2-4.htm

అయితే ఈ తప్పుని సరి చేసే ప్రయత్నం తెలుగు మరియు హిందీ బైబిల్ రచయితలు చేశారు.

తెలుగులో ఇలా ఉంది.

“యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను.”(యోహాను 2:4)

హిందీ లో ఇలా ఉంది.

जब दाखरस घट गया, तो यीशु की माता ने उस से कहा, कि उन के पास दाखरस नहीं रहा।”

రెండు చోట్లా woman అనే పదాన్ని తల్లిగా మార్చేశారు.కానీ అలా చేయడం వలన హిందీలో అర్థం చెడిపోయింది. యేసు కాకుండా ఆ మాట మేరీ చెప్పినట్టుగా ఆణువదించాల్సి వచ్చింది.

Example -2

When Jesus saw his mother there, and the disciple whom he loved standing near by, he said to his mother, “Dear woman, here is your son. (John 19:26)

ఇక్కడ మళ్ళీ dear woman అని ఉంది ఇంగ్లీష్ బైబిల్ లో..

మరి తెలుగులో..

యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను.

అబ్బా… dear woman అనే phrase మళ్ళీ అమ్మా అయిపోయింది.

ఇక హిందీలో చూద్దాం.

यीशु ने अपनी माता से कहा; हे नारी, देख, यह तेरा पुत्रा है।

పాపం హిందీ అనువాదకులకి చిరాకు వచ్చింది dear woman ని हे नारी అని అనువాదించారు.

సరే, యేసు మేరీ ని యేసు అమ్మా అనలేదు dear woman అన్నాడు అని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచమంతా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. ఎందుకు అంటే అన్నీ ఇంగ్లీష్ అనువాదాల్లో woman అనే ఉంది కాబట్టి.

అన్నీ English Bible లలో woman అనే ఉంది. Link చూడండి.

https://biblehub.com/john/19-26.htm

ఎలాగూ dear woman అనే అన్నీ చోట్లా ఉంది కాబట్టి దాన్ని ఖందించలేని పరిస్థితి. కాబట్టి దానికోక సమాధానం చెపుతారు.

యేసు బాప్టిజం తీసుకొని దేవుని సేవలో ఉన్నాడు కాబట్టి సమాజాన్ని కుటుంబంగా భావించే వాడు. అందుకే తన తల్లిని కూడా స్త్రీగా సంభోదించాడు అని.

దేవుని సేవలో ఉంటే కుటుంబాన్ని ద్వేషించాలా?
అమ్మని అమ్మా అని పిలవకూడదా? బాప్టిజం తీసుకోక ముందు యేసు తన తల్లిని అమ్మా అని ఎప్పుడైనా పిలిచాడా? చూద్దాం.

చిన్న వయసులో ఉన్నప్పుడు..

లూకా 2:48

ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా

లూకా 2:49

ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;

ఇక్కడ మేరీ నోరారా కుమారుడా అని పిలిచినా యేసు ఆమెను అమ్మా అని పిలవలేకపోయాడు.

కాబట్టి యేసు మేరీని అమ్మా అని పిలిచిన సందర్భాలు చిన్నప్పటి నుండి చనిపోయే వరకు ఎప్పుడూ లేవు.

మరి ఇలా ఎందుకు జరిగింది?

  1. బాప్టిజం తీసుకుంటే కుటుంబాన్ని పట్టించుకోకూడదు కాబట్టి.
  2. మేరీ పైన యేసుకి బాగా కోపంగా ఉంది మనసులో.
  3. తాను దేవుడి కొడుకు కాబట్టి మానవ మాతృరాలిని అమ్మా అని పిలవ కూడదు అని యేసు అనుకునే వాడు. ఆమె కేవలం.
  4. తానే యెహోవా అని యేసు నమ్ముతున్నాడు కాబట్టి తన వల్లే తల్లి అయిన స్త్రీని యేసు అమ్మా అని పిలిస్తే contradiction (వైరుధ్యం) అవుతుంది కాబట్టి.. Dear woman అని యేసు రూపంలో ఉన్న యెహోవా పిలిచే వాడు. మేరీని తల్లిని చేసిన వాడే ఆమెను అమ్మా అని పిలిస్తే తేడాగా ఉంటుంది కదా!

వీటిలో మీకు ఏది సరైనది అనిపిస్తోంది? కింద కామెంట్ చేయండి.

హిందువులు అయ్యప్ప మాల, హనుమాన్ మాల వేసుకున్నప్పుడు కూడా కుటుంబానికి దూరంగా ఉంటారు కానీ.. అప్పుడు కూడా సొంత తల్లిని ఓ స్త్రీ అనరు… పరాయి స్త్రీని కూడా మాత అంటారు.

కాబట్టి ఇలాంటి బైబిల్ వలన వాటిలోని కథల వలన సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతుందో గమనించగలరు. తన తల్లిని యేసు అమ్మా అని ఎన్నడూ పిలవలేదు అన్న విషయన్ని మరుగుపరిచడానికే ఇలా అనువాదం చేశారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *