ప్రవక్తలా? పసిపిల్లలా? దేవుడికి ఎవరు అంటే ఇష్టం? ఖచ్చితంగా ప్రవక్తలే అంటుంది బైబిల్

బైబిల్ దేవుడు చేసిన ఘోరమైన హత్యల్లో ఇప్పుడు మనం చర్చించబోయే పిల్లల హత్యలు ప్రధానమైనవి.

క్రైస్తవులు తమ దేవుడు ఎంతో కరుణామయుడు అని చెప్పుకుంటారు. ఆయన ఎంత కరుణామయుడో ఈ సంఘటన నిరూపిస్తుంది.
ఇక విషయానికి వస్తే, బైబిల్లో ఎలీషా అనే ప్రవక్త ఒక సారి ఒక ఊరు దాటి వెళతూ ఉంటే ఆ దారిలో ఆటలు ఆడుకుంటున్న కొందరు పిల్లలు అతన్ని చూసి బట్టతల వాడా బట్టతల వాడా అని.. కామెంట్ చేస్తారు. అంతే. సదరు ప్రవక్త గారికి ఎక్కడలేని కోపం తన్నుకొస్తుంది. కోపం వచ్చి దేవుని నామంలో శపించేస్తాడు. అప్పుడే రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి అక్కడున్న 42 మంది పిల్లల్ని చంపేస్తాయి. ఇది క్లుప్తంగా కథ. దీనిని బట్టి యెహోవా ఎంత కరుణామయుడో అర్థం చేసుకోండి.

ఇంతటి కరుణాసముద్రుడు మరెక్కడైనా ఉంటాడా?

బైబిల్ రిఫరెన్సులు:

అక్కడనుండి అతడు(ఎలీషా) బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చిబోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను. (2 రాజులు 2:23-24).

బైబిల్ దేవుడు పిల్లల మీద కంటే ప్రవక్తల మీద ప్రేమ చూపించడం, పిల్లలను అతి ఘోరంగా చంపించడం క్రైస్తవులకు తెలియంది కాదు. కాకపోతే వారి వ్యపారానికి అనుకూలంగా కరుణామయుడు అనే ట్యాగ్ లైన్ వారి దేవుడు తగిలించుకుంటారు. అంతే.

ఇలాంటి ఘోరమైన హత్యలు, సంఘటనలు బైబిల్లో కోకొల్లలు.

అలాంటి మరో హత్యతో మరో రక్త సువార్తలో (రక్త సువార్త-3) కలుద్దాం. సెలవు.

1 thought on “రక్త సువార్త -2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *