వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం.

బైబిల్లో లిఖించబడిన సత్యమిదే. యెహోవా యొక్క కత్తి మనుషుల తలకాయలు తింటుంది. వారి నెత్తురు తాగుతుంది. ఆ మాట కూడా ఆయనే చెబుతున్నాడు.

చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను. (ద్వితీయోపదేశకాండము 32:42)

I will make my arrows drunk with blood, while my sword devours flesh: the blood of the slain and the captives, the heads of the enemy leaders.(Deuteronomy 32:42)

ఇక్కడ ఖడ్గం ఎవరెవరి తలలను భక్షిస్తుంది? వేటిని భక్షిస్తుంది?

  1. చంపబడినవారి రక్తమును
  2. చెరపట్టబడినవారి రక్తమును
  3. శత్రువులలో వీరుల తలలను

చంపబడినవారి రక్తమును యెహోవా ఖడ్గం భక్షిస్తుంది. అనగా వారి రక్తంలో మునిగి తేలుతుంది. ఆంగ్ల అనువాదం చూడండి.
I will make my arrows drunk with blood (ARROWS?)
ఇక్కడ తెలుగులో కలగా పులగం చేశారు. యెహోవా బాణాలు మనుషుల రక్తాన్ని తాగుతాయి.

యెహోవా ఖడ్గం మనుషుల తలలను తింటుంది(భక్షిస్తుంది) అంటే నరికేస్తుంది అని అర్ధం. కానీ తినేస్తుని అని రచయిత ప్రయోగం చేశాడు . ఒకవేళ యెహోవా చెప్పి ఉంటే తలకాలను ఆయన ఖడ్గం తింటుంది అనే ప్రయోగం చాలా పెద్ద మాటే.

నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.(ద్వితీయోపదేశకాండము 32:41)

when I sharpen my flashing sword and my hand grasps it in judgment, I will take vengeance on my adversaries and repay those who hate me.(Deuteronomy 32:41)

ఇక్కడ యెహోవా బాణముల గురుంచి క్లియర్ గా ఉంది. యెహోవాని ద్వేషించే వారిని యెహోవా బాణములు చంపుతాయి. వాళ్ళ రక్తంలో మునిగి తేలుతాయి.

ఇలా అనేక చోట్ల మనుషుల రక్తంతో యెహోవా ఖడ్గం మరియు అతని బాణములు మునిగి తేలుతాయి అని యెహోవా చెప్పుకొచ్చాడు బైబిల్లో. అలాగే యెహోవాయే యేసు అని కొందరు వాదిస్తారు. అప్పుడు ఇలా మనుషుల తలకాయలను, రక్తాన్ని భక్షించే ఖడ్గం, బాణములు కలవాడు కరుణామయుడు ఎలా అయ్యాడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతుంది.

అయితే దీనిని మరో కోణంలో చూస్తే ఈ వాక్యం యెహోవా యొక్క యుద్ధ కాంక్షను తెలియజేస్తుంది.

శత్రువులను చంపి వారి రక్తాన్ని తాగే వీరులా యెహోవాను కీర్తిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడ కూడా యెహోవా శత్రువులను ప్రేమించడం మనం గమనించము.నిజానికి యెహోవా కోసం రక్తపాతం సృష్టించమని బైబిల్ ప్రేరేపిస్తుంది.

ఈ వాక్యాన్ని గమనించండి.

యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. (యిర్మియా 48:10)

యెహోవా పేరుతో యుద్ధం చేయడానికి కత్తి ఎత్తినవాడు రక్తం చిందకుండా కత్తి దించడాన్ని పాపంగా చూపిస్తోంది. అలా చేసినవారికి యెహోవా శాపం తగులుతుంది అని చెబుతుంది. బహుశా ఇలాంటి వాక్యాలను చదివే మతోన్మాదులు క్రుసేడులు (the crusades) వంటి మారణహోమాలు జరిపి ఉంటారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకున్న అంగ్లేయలకు కూడా ఈ వాక్యాలే ప్రేరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *